‘బిగ్‌బాస్‌లో ఆ ముగ్గురిని అసభ్యంగా తాకుతూ.. ఆ కంటెస్టెంట్ అంతు చూస్తా’
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ మహిళా కమీషన్ వరకు విషయం వెళ్లడంతో శివాజీ దిగొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బతినుంటే తనను క్షమించాలని శివాజీ ఓ వీడియో విడుదల చేశారు.
అలాగే ఈ వివాదానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆ మరుసటి రోజు మీడియా ముందుకొచ్చారు శివాజీ. తాను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదని.. హీరోయిన్ నిధి అగర్వాల్‌కు షాపింగ్ మాల్‌లో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా హీరోయిన్లు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యమని శివాజీ వెల్లడించారు. ఈ సమయంలో రెండు పదాలు తప్పుగా దొర్లాయని, ఇలాంటి వాటిని నేను మాట్లాడకుండా ఉండాల్సిందని శివాజీ అన్నారు. అయితే కొందరు సంబంధం లేనివారు అనవసరం ఈ వివాదంలోకి వస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. దాంతో యాంకర్ అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయి వంటి వారు శివాజీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సామాజికవేత్తగా, హేతువాదిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు గోగినినేనికి బిగ్‌బాస్ షో మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆయన తన ఐడియాలజీ, మాటలు, ప్రసంగాలతో కంటెస్టెంట్స్‌తో పాటు యువతను బాగా ఆకట్టుకున్నాడు. బాబు గోగినేనికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. బిగ్‌బాస్ హౌస్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి కష్టాలు, సమస్యలను పరిష్కరిస్తూ వచ్చాడు. అయితే బాబు వ్యాఖ్యలపై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విజేత అయిన కౌశల్‌కు, కౌశల్ ఆర్మీకి బాబు గోగినేని అంటే అస్సలు పడేది కాదు. ఈ క్రమంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు.
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన బాబు గోగినేని ఎప్పటిలాగే తన హేతువాద ప్రసంగాలు, టీచింగ్స్‌తో బిజీగా ఉంటూనే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్స్‌పై సోషల్ మీడియాలోనూ, టీవీ ఛానెల్స్‌లో జరిగే డిస్కషన్స్‌లోనూ పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన డిస్కషన్స్ పాల్గొని తనదైన ప్రసంగం చేశాడు. శివాజీకి అసలు ఏం పని. నాకు భయం వేసిన విషయం ఏంటంటే? ఇతను ఇలా మాట్లాడాడు అనే కాదు. ఇతను మొదటి వాడు కాదు. నందమూరి బాలకృష్ణ.. పద్మవిభూషణ్ బాలకృష్ణ స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడాడో మనకి తెలుసు. పద్మశ్రీ పుచ్చుకుని, పీఠం ఎక్కి కూర్చొని గరికపాటి ఏం మాట్లాడాడో మనకి తెలుసు అని బాబు గోగినేని వ్యాఖ్యానించారు.
పబ్లిక్ లైఫ్‌లో ఆడవారి పట్ల ఒక నీచమైన భావన ఉన్నవాళ్లే మగాళ్లు మనకి ఎక్కువగా కనిపిస్తారు. ముఖ్యంగా సినిమా రంగంలో. డైలాగ్స్ రాస్తున్న దర్శకులు, చెబుతున్న హీరోలని తిట్టాలి కదా. కేసులు పెట్టాలి కదా? పెట్టలేదు. ఈ విచ్చలవిడితనం ఈ స్టుపిడ్ ఫెలోతో స్టార్ట్ కాలేదు. అదోక టాక్సిక్ కల్చర్‌గా ఉంది. ఇది మనకి తెలిసిన విషయమే. నాకు భయం ఎక్కడ వేసిందంటే? ఆ మీటింగ్‌లో అంతమంది ఆడవాళ్లు ఉన్నారు. ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు దాంట్లో కనీసం ముగ్గురు ఆడవాళ్లు మమ్మల్ని ఫలానా కంటెస్టెంట్ అసభ్యంగా తాకాడు అని చెప్పారు. నాకు మీ పేరు చెప్పే హక్కు లేదు.. ఆ ముగ్గురు ఒకసారి కెమెరా ముందు మాట్లాడి.. మిమ్మల్ని పరిచయం చేసుకోండి. నేను దానిని ఎక్కడిదాకా తీసుకెళ్లాలో? అక్కడి దాకా తీసుకెళ్తానని అన్నాను. నేను ఊరికే అనలేదు ఫలానా వాడు ఇంట్లో ఉండకూడదు, ఇంటి బయటికి పంపించేయండి అని. కానీ అంతకుమించి అనే హక్కు నాకు లేదు, చట్టప్రకారం గానీ, నైతికంగా గానీ. వాళ్లు సార్ మేము ఇలా మాట్లాడితే... మాకు రేపు, ఎల్లుండి టీవీలో కానీ, సినిమాలో గానీ ఛాన్స్ రాదు.. మేం మాట్లాడలేము అన్నార అని బాబు గోగినేని తెలిపారు.
మిగిలిన విషయాల్లో ఆమె ప్రవర్తన ఎలా ఉన్నా.. శ్రీరెడ్డి అనే ఆవిడ వచ్చి ఏం ప్రొటెస్ట్ చేసింది? అమెరికాలో ఎలా మీటూ ఉద్యమం కొనసాగిందో మన తెలుగు కల్చర్ కానీ, తమిళ్, కన్నడ, మలయాళం, బాలీవుడ్‌లో సినిమా కల్చర్ కానీ ఈ అన్ని చోట్లా మేల్ డామినేటింగ్ మాత్రమే కాదు.. ఆడవాళ్లకి వ్యతిరేకంగా ఉంది. కేవలం మగాళ్లకి ప్రాధాన్యతే కాదు.. ఆ ఈవెంట్‌లో వింటున్న ఆడవాళ్లు నవ్వారు. మన రియల్ ప్రాబ్లమ్ అక్కడే ఉంది అని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బిగ్‌బాస్ హౌస్‌లో తమను ఒక కంటెస్టెంట్ తాకాడు అని చెప్పిన ఆ ముగ్గురు ఆడవాళ్లు ఎవరు? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మరి బాబు గోగినేని చెప్పినట్లుగా ఆ ముగ్గురు మీడియా ముందుకు వస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











