పెళ్లిపై స్పందించిన భాను శ్రీ.. బిగ్‌బ్యాస్ బ్యూటీకి కళ్యాణ ఘడియలు వచ్చేశాయ్!!

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ గురించి, ఆమె ప్రేమ గురించి, జీవితంలో పడిన కష్టాల గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న భాను శ్రీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. షోలోని టాస్క్‌లో భాగంగా ఆమె తన జీవితంలోని ఒడిదుడుకులు, కష్టాలు, సినీ రంగంలోకి బాధలు, తోడుగా ఉన్న స్నేహితుడు, వారి ప్రేమ కథను వివరించి అందర్నీ కంటతడి పెట్టించింది. ఇంట్లో వారు కూడా తోడుగా నిలబడలేదని, కానీ అతను మాత్రం తన బాగోగులు చూసుకున్నాడని తెలిపింది. తాజాగా భాను తన పెళ్లిపై స్పందించింది.

 ఘాటు పాత్రలు..

ఘాటు పాత్రలు..

బిగ్ బాస్ తరువాత భాను శ్రీకి వెండితెరపై అవకాశాలు భారీగానే వచ్చాయి. అంతకు ముందు డ్యాన్సర్‌గా కెరీర్ కొనసాగినా.. బిగ్ బాస్ అనంతరం స్పెషల్ రోల్స్ భారీగానే వచ్చాయి. మరీ ముఖ్యంగా ఏడు చెపల కథ వంటి చిత్రంలో ఘాటు పాత్రను పోషించడంతో అంతా షాక్ అయ్యారు.

బుల్లితెరపై..

బుల్లితెరపై..

ఓ వెపై వెండితెర, మరో వైపు బుల్లితెరపై భాను శ్రీ సందడి చేస్తోంది. ఆ మధ్య ఢీ, జబర్దస్త్ షోల్లో హల్చల్ చేసిన భాను శ్రీ ప్రస్తుతం అదిరింది ప్రోగ్రామ్‌లో దుమ్ములేపుతోంది. యాంకర్ రవితో కలిసి హోస్ట్ చేస్తోన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా మంచి పేరే వచ్చింది. అదిరింది షోతో పాటు భాను శ్రీ కూడా క్లిక్కయింది. తాజాగా భాను శ్రీ, రవి ఇద్దరూ కూడా అదిరింది సెట్ నుంచి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చారు.

పెళ్లిపై కామెంట్..

పెళ్లిపై కామెంట్..

ఈ క్రమంలోనే భాను తన పెళ్లిపై స్పందించింది. అదిరింది షో నిర్మాణ సంస్థ అగస్త్య ఎంటర్టైన్మెంట్స్ అడిగిని ప్రశ్నలకు భాను శ్రీ సమాధానం ఇచ్చింది. పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. వచ్చే ఏడాది ఉండొచ్చు అని సమాధానం ఇవ్వగా.. అయితే పెళ్లి కూతురు ఎవరని భాను శ్రీకి సెటైర్ వేశారు.

Recommended Video

Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
 వచ్చే ఏడాది..

వచ్చే ఏడాది..

దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అయితే పెళ్లి విషయంలో మాత్రం వచ్చే ఏడాది అంటూ సరైన సమాధాన్ని చెప్పినట్టు కనిపిస్తోంది. మరి చూడాలి వచ్చే ఏడాదే భాను శ్రీకి కళ్యాణ ఘడియలు ఉన్నాయేమో. ఇంతకు ముందే ఎప్పుడో తన ప్రేమ కథను అందరి ముందు చెప్పేసింది. ఇక వివాహానికి చక్కటి ముహూర్తం చూసుకోవడమే తరువాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X