Deepthi Sunaina: గ్లామర్ గేట్లు లేపేసిన దీప్తి సునైనా.. క్లోజప్‌లో షాట్స్‌తో కాక రేపేలా!
ఆకట్టుకునే అందంతో ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యారు. తద్వారా వెండితెరపైనో, బుల్లితెరపైనో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో దీప్తి సునైనా (Deepthi Sunaina) ఒకరు. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. అలాగే, అవకాశాలను సైతం దక్కించుకుని సత్తా చాటింది. ఇక, సోషల్ మీడియాలో హాట్ షో చేసే దీప్తి సునైనా.. తాజాగా తన బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!
యూట్యూబర్‌గా పాపులర్
సామాజిక మాధ్యమాల ద్వారా హైలైట్ అయిన దీప్తి సునైనా యూట్యూబర్‌గా మారి.. ఎన్నో రకాల డ్యాన్స్ వీడియోలు, కవర్ సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేసింది. ఇలా చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఫలితంగా సోషల్ మీడియాలో దీప్తి సంచలనం అయిపోయింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గానూ మారింది.

బిగ్ బాస్ ఛాన్స్‌తో ఫుల్‌గా
యూట్యూబర్‌గా చేస్తున్నప్పుడే దీప్తి సునైనాకు అవకాశాలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. అందులో ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, అందాలను ఆరబోస్తూ యమ హైలైట్ అయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ రెచ్చిపోయింది. దీంతో దీప్తి క్రేజ్ ఫుల్‌గా పెరిగిపోయిందనే చెప్పాలి.
అతడితో ప్రేమకు బ్రేకు
యూట్యూబర్‌గా ఎదుగుతోన్న కొత్తలోనే దీప్తి సునైనా.. సహచరుడు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ లవ్‌లో మునిగి తేలారు. ఫలితంగా జంటగానే వీళ్లిద్దరూ ఫుల్ ఫేమస్ అయిపోయారు. అయితే, షన్నూ బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటోంది.
స్పీడ్ తగ్గించి ఎంజాయ్
సుదీర్ఘ కాలం పాటు యూట్యూబ్‌లో దీప్తి సునైనా వరుస వీడియోలతో ఫ్యాన్స్‌ను యమ అలరించింది. కానీ, ఈ మధ్య స్పీడును అమాంతం తగ్గించేసింది. అయితే, ఇటీవలే ఈ చిన్నది 'ఏమోనే' అనే క్యూట్ రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. ఈ పాటకు అదిరిపోయే స్పందన వచ్చింది. ప్రస్తుతం దీప్తి పర్సనల్ ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగిపోతోంది.
సోషల్ మీడియాలోనేగా
దీప్తి సునైనా సెన్సేషన్ అయిపోవడానికి సోషల్ మీడియానే కారణం అని అందరికీ తెలిసిందే. అందుకే ఆమె ఇందులోనే ఎప్పుడూ హడావిడి చేస్తుంటుంది. అంతేకాదు, తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా అభిమానులను అలరిస్తూ వెళ్తోంది.

ఘాటు షోతో కవ్విస్తోంది
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోన్న దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను కూడా వరుస పెట్టి షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా తన సీక్రెట్ అందాలను చూపిస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో దీప్తి తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.
దీప్తి బోల్డు పిక్స్ వైరల్
యూట్యూబ్ సెన్సేషణ్ దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్‌తో కట్ చేసిన బుల్లి గౌను వేసుకుని ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు ఓరగా కనిపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











