టైట్ ఫిట్‌లో దీప్తి సునైనా అరాచకం.. మిద్దెపైకెక్కి చిలిపి పనులు!
సోషల్ మీడియా రాకతో ఇన్‌ఫ్లూయెన్సర్లుగా అవతారం ఎత్తిన యువతీ యువకులు తమ టాలెంట్‌తో స్టార్‌డమ్‌ను సంపాదించుకుంటున్నారు. యాక్టింగ్, డ్యాన్స్ సహా తమ ప్రతిభను వ్యక్తపరుస్తూ డబ్బుతో పాటు ఫేమ్ అందుకుంటున్నారు. ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మొదట్లో రాణించిన వారే. ఈ కోవలోకే వస్తారు బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైన. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌కు చెందిన దీప్తి సునైన సోషల్ మీడియా సంచలనం అని చెప్పొచ్చు. షార్ట్ ఫిలింస్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కవర్ సాంగ్స్, డబ్‌స్మాష్ ,టిక్ టాక్ వీడియోలతో మరింత పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో దీప్తి తన అందం, మైండ్ గేమ్‌లో ఆకట్టుకున్నారు. ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా సులభంగా గట్టెక్కెస్తూ దాదాపు 70 రోజుల పాటు హౌస్‌లో ఉన్న దీప్తి సునైనా అప్పట్లో టాప్ టెన్‌లో ఉంటారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయ్యారు.

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నవాళ్లకి జట్టు కట్ చేయించుకునే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 2లో ఈ ఛాన్స్ దీప్తి అందుకున్నారు . ఆ తర్వాత సీజన్‌లలో శివజ్యోతి, దెత్తడి హారిక, ప్రియాంక జైన్ తదితరులు తమ హెయిర్ కట్ చేయించుకుని బిగ్‌బాస్ నుంచి బెనిఫిట్స్ పొందారు. హౌస్‌లో ఉన్న సమయంలో యంగ్ హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉంటూ కుర్రాళ్లకు షాకిచ్చింది. దీప్తి ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నప్పుడు తనీష్ బాగా ఎమోషనలైన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.
యూట్యూబర్, మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడిన దీప్తి సునైనా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించారు. రేపో మాపో పెళ్లి పీటలెక్కుతారని అంతా అనుకుంటున్న దశలో అనూహ్యంగా వీరిద్దరూ బ్రేకప్ చోటు చేసుకోవడంతో వీరి అభిమానులు షాకయ్యారు. షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు సిరి హనుమంతుతో క్లోజ్‌గా ఉండటం, వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హౌస్ నుంచి షన్నూ బయటికొచ్చిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. షన్నూతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే గడిపేస్తోన్న దీప్తి తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేశారు.
ఇటీవల తీర్థయాత్రలు బాగా చేస్తోంది దీప్తి సునైనా. తన మిత్రులతో కలిసి వారణాసి, తిరుమల సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టారు . అలాగే మొన్నామధ్య శివుడి బొమ్మను తన చేతిపై టాటూగా వేయించుకుంది దీప్తి. అందులో ఓ చిన్న పిల్ల.. ఈశ్వరుడి వెంట నడుస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైనా తాజాగా తన ఇంటి మిద్దెపై సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఫోటో షూట్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం దీప్తి సునైనా అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











