కాలు జారితే 13500 అడుగుల లోయలోకే... దీప్తి సునైనా సాహసం

యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సెలబ్రిటీగా మారిన వారిలో దీప్తి సునైనా ఒకరు. టిక్‌టాక్, డబ్‌స్మాష్, షార్ట్ ఫిలింస్, ఇతర వీడియోలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 2లో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులర్ అయ్యింది. తర్వాత సినిమాల్లో దున్నేస్తుందని అంతా అనుకున్నప్పటికీ ఎందుకో ఆమె కెరీర్ డల్ అయ్యింది. అయితే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా బాగానే సంపాదిస్తోంది. తాజాగా దీప్తి సునైనా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read
యాక్టింగ్‌కు శోభా శెట్టి గుడ్‌బై? దిమ్మతిరిగేలా కార్తీక దీపం విలన్ రిప్లయ్
యాక్టింగ్‌కు శోభా శెట్టి గుడ్‌బై? దిమ్మతిరిగేలా కార్తీక దీపం విలన్ రిప్లయ్

వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో తనతో కలిసి నటించిన మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడింది దీప్తి. కానీ అనూహ్యంగా అతనితో బ్రేకప్ చెప్పి అభిమానులకు షాకిచ్చింది. రేపో మాపో పెళ్లి పీటలెక్కుతారు అని అభిమానులు భావిస్తుండగా.. దీప్తి- షన్నూ విడిపోవడం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి కారణాలు తెలియరాలేదు. అయితే బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు యాంకర్ సిరి హనుమంతుతో షన్నూ క్లోజ్‌గా ఉండటం, ఇతరత్రా అంశాలు వీరి మధ్య మనస్పర్థలకు కారణంగా నెటిజన్లు భావిస్తున్నారు.

Bigg Boss Fame Deepthi Sunaina s Annapurna Base Camp Trek Goes Viral

షన్నూతో బ్రేకప్ తర్వాత ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు దీప్తి. షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ ఆల్బమ్స్‌, మ్యూజిక్ వీడియోలతో హల్‌చల్ చేస్తున్నారు. అయితే షణ్ముఖ్ మాత్రం వైష్ణవి అనే అమ్మాయితో ప్రేమలో పడి ఇటీవలే ఆమెతో ఎంగేజ‌్‌మెంట్ చేసుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు వారిద్దరికీ పెళ్లి జరిగిపోయిందని కూడా రాశాయి. ఖాళీ సమయాల్లో తన స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు దీప్తి. ఈ ముద్దుగుమ్మకు భక్తి, పూజలు కూడా ఎక్కువే. తరచుగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వారణాసి యాత్రలకు వెళ్తుంటారు.

Recommended For You
రష్మి లవ్ ఫెయిల్యూర్... అతని ట్రాప్‌లో అలా ఇరుక్కున్న స్టార్ యాంకర్
రష్మి లవ్ ఫెయిల్యూర్... అతని ట్రాప్‌లో అలా ఇరుక్కున్న స్టార్ యాంకర్

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైనా తన షోలు, వ్యక్తిగత వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నేపాల్‌లోని హిమాలయ పర్వతాలలో ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కు తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్లింది దీప్తి. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆమె షేర్ చేశారు.

You May Also Like
Pallichattambi Movie Twitter Review: పల్లిచట్టంబి మూవీ ట్విట్టర్ రివ్యూ
Pallichattambi Movie Twitter Review: పల్లిచట్టంబి మూవీ ట్విట్టర్ రివ్యూ

ఉన్నది ఉన్నట్లుగా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఏబీసీ ట్రెక్‌లో మేము అనుభవించిన భావోద్వేగాలు, నవ్వులు, కష్టాలు, స్వచ్ఛమైనప ఆనందాన్ని ఏ ట్రెండింగ్ ఆడియో కూడా అధిగమించలేదు. ప్రతి అడుగు, ప్రతి శ్వాస, ప్రతి దృశ్యం అతీంద్రియంగా అనిపించాయి. ఇలాంటి అద్భుతమైన ప్రయాణాన్ని మాకు అందించిన వారికి కృతజ్ఞతలు, నేను ఊహించని రీతిలో ఈ ట్రిప్ నన్ను మార్చేసింది. ఈ ప్రయాణం నాకు జ్ఞాపకాలను మాత్రమే కాదు. కథలను, బలాన్ని, మంచి మనుషులను కూడా ఇచ్చింది. జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా మనుషులకు తోటి మనుషులతో అవసరం ఉంటుందని దీప్తి సునైనా రాసుకొచ్చారు.

ఆ యంగ్ హీరో మూవీలో చిరంజీవి, బాలయ్య? ఫ్యాన్స్‌కు పూనకలే
ఆ యంగ్ హీరో మూవీలో చిరంజీవి, బాలయ్య? ఫ్యాన్స్‌కు పూనకలే

కాగా.. నేపాల్‌లో ఉన్న ఈ అన్నపూర్ణ బేస్ క్యాంప్.. సముద్ర మట్టానికి 4130 మీటర్లు (13549 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఇక్కడి అన్నపూర్ణ సర్కూట్, అన్నపూర్ణ సాంక్య్చూరీలను సందర్శించడానికి ప్రతియేటా ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. ట్రెక్కింగ్ మార్గంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో స్థానం సంపాదించిన అన్నపూర్ణ 2, అన్నపూర్ణ 3, అన్నపూర్ణ 4, ధౌలగిరి, నీలగిరి శిఖరాల అందాలు సరికొత్త అనుభూతిని పంచుతాయి. హిమానీ నదాలు, ప్రమాదకరమైన లోయలు, బౌద్ధ మఠాలు, స్తూపాలు, ఉవ్వెత్తున ఎగసిపడే నదులు ఉంటాయి. అయితే అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రయాణంలో ఏమాత్రం కాలు జారినా 13500 అడుగుల మంచు లోయల్లోకి జారిపోతారు. కాబట్టి అనుక్షణం అప్రమత్తత అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X