Deepthi Sunaina: చీరకట్టులో దీప్తి సునైన మేజిక్... పొలాల్లో అలా రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ

యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సెలబ్రిటీగా మారారు దీప్తి సునైనా. టిక్‌టాక్, డబ్‌స్మాష్, షార్ట్ ఫిలింస్, ఇతర వీడియోలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 2లో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులర్ అయ్యింది దీప్తి. ఆ టైంలో తన గ్లామర్‌తో బిగ్‌బాస్ హౌస్‌కి మరింత అందాన్ని తీసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. హౌస్‌లో ఉన్న సమయంలో యంగ్ హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉంటూ కుర్రాళ్లకు షాకిచ్చింది. వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో తనతో కలిసి నటించిన షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడి అనూహ్యంగా అతనితో బ్రేకప్ చెప్పేసింది.

త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారని అంతా అనుకుంటున్న దశలో ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అభిమానులకు షాకిచ్చింది. మరీ ముఖ్యంగా షణ్ముఖ్ బిగ్‌బాస్‌ హౌస్ నుంచి బయటికొచ్చిన వెంటనే బ్రేకప్‌ జరగడం అభిమానులను బాధించింది. వీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారని అంతా అనుకున్నారు. షణ్ముఖ్ - దీప్తి సునైనా మధ్య బ్రేకప్ జరగడానికి కారణలు తెలియరాలేదు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో యాంకర్ సిరి హనుమంతుతో షన్నూ క్లోజ్‌గా ఉండటం, ఇతరత్రా అంశాలు కారణంగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి.

Bigg Boss Fame Deepthi Sunaina s Stunning Red Saree Photoshoot Goes Viral on Social Media

కానీ షన్నూతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోన్న దీప్తి తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేశారు. అయితే షణ్ముఖ్ మాత్రం వైష్ణవి అనే అమ్మాయితో ప్రేమలో పడి ఇటీవలే ఆమెతో ఎంగేజ‌్‌మెంట్ చేసుకున్నారు. ఆమె గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. మా అమ్మ బీభత్సంగా పూజలు చేయడం వల్లే తనలాంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందంటూ పొంగిపోయాడు.

ప్రస్తుతం రీల్స్, షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ ఆల్బమ్స్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు దీప్తి సునైన. ఖాళీ సమయాల్లో తన స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తున్నప్పటికీ దీప్తిలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. తరచుగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వారణాసికి వెళ్తుంటారు. పరమేశ్వరుడిని ఎక్కువగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ.. కొద్దిరోజుల క్రితం శివుడి బొమ్మను తన చేతిపై టాటూలా వేయించుకుంది.

30కి దగ్గరవుతున్నా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రస్తుతం తన ఫోకస్ కెరీర్ మీదే ఉందని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పలుమార్లు చెప్పింది దీప్తి. కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఖరీదైన టయోటా హై లక్స్ అనే కారును కొనుగోలు చేసి షాకిచ్చింది. అప్పట్లోనే దీని ధర 37 లక్షల రూపాయలు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం షాక్ అయ్యారు.

ఇకపోతే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైనా.. తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలు, తన మ్యూజిక్ ఆల్బమ్స్ గురించి వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు. తాజాగా రెడ్ కలర్ శారీలో పొలాల వెంట చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more about: bigg boss deepthi sunaina
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X