ఇక ఆయన వెనుకే నేను .. ఆ ప్లేస్‌లో టాటూతో షాకిచ్చిన దీప్తి సునైన
సోషల్ మీడియా రాకతో ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు టెక్నాలజీని మంచికి వాడితే దాని వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. టాలెంట్ ఉండి దానిని ఎలా బయటపెట్టాలో తెలియని ఎంతో మందికి ఇది వేదికలా మారింది. రీల్స్, వీడియోలతో పలువురు ప్రతిభావంతులు తమ టాలెంట్‌ని నిరూపించుకుని ఎన్నో అవకాశాలు పొందారు, ఇంకా పొందుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలోని యంగ్ హీరో హీరోయిన్లు చాలా మంది ఇలా ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇలాంటి వారిలో దీప్తి సునైన ఒకరు.
యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాద్ అమ్మాయి .. షార్ట్ ఫిలింస్, ఇతర వీడియోలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 2లో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ టైంలో తన మైండ్ గేమ్, గొడవలతో పాటు తన అంద చందాలతో బిగ్‌బాస్ హౌస్‌కి గ్లామర్ తీసుకొచ్చింది దీప్తి సునైనా. హౌస్‌లో ఉన్న సమయంలో యంగ్ హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉంటూ కుర్రాళ్లకు షాకిచ్చింది. బిగ్‌బాస్ తర్వాత తెలుగునాట బాగా పాపులర్ అయ్యారు దీప్తి.

యూట్యూబర్, మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ .. చాలా కాలం పాటు అతనితో రిలేషన్ కొనసాగించారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారని అంతా అనుకుంటున్న దశలో అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం అభిమానులకు షాకిచ్చింది. మరీ ముఖ్యంగా షణ్ముఖ్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. షన్నూతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోన్న దీప్తి తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేశారు.
రీల్స్, షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ ఆల్బమ్స్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఖాళీ సమయాల్లో విహారయాత్రలకు వెళ్లే దీప్తిలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. ఇటీవల తన ఫ్రెండ్స్ మెహబూబ్, దెత్తడి హారికలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీప్తి సునైనా.. కొద్దిరోజుల క్రితం కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ అవుతున్నాయి. గంగా నదిలో పడవలో విహరిస్తూ.. పావురాళ్లు, కొంగలకు ఆహారం వేస్తూ ఆడుకుంది.
తాజాగా తన ఎడమ చేతిపై టాటూ వేయించుకున్న దీప్తి సునైన దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ టాటూలో ఓ అమ్మాయి శివుడిని అనుసరిస్తూ వెళ్తున్నట్లుగా ఉంది. ఆ అమ్మాయి తనే అని చెప్పిన దీప్తి.. ఇకపై శివయ్య బాటలోనే నేను అంటూ ఈ వీడియోకి కొటేషన్ రాసుకొచ్చింది. ఆ పరమేశ్వరుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అనేలా ఆ టాటూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుండగా.. ఆ మహాదేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











