బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి బిగ్‌బాస్ బ్యూటీ.. టేప్ రికార్డర్‌తో అలా!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించి సెలబ్రెటీగా మారిన వారిలో అచ్చు తెలుగు అమ్మాయి దీప్తి సునైన ఒకరు. షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ , డబ్‌స్మాష్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది దీప్తి. వ్యక్తిగత జీవితంలో వివాదాలతో ఆమె వార్తల్లో నిలిచారు. తన తోటి యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమ, బ్రేకప్ కూడా ఆమెకు పాపులారిటీని తెచ్చిపెట్టింది. దీప్తి ఏం చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వివరాల్లోకి వెళితే..

షణ్ముఖ్‌తో దీప్తి బ్రేకప్
బిగ్‌బాస్ హౌస్‌లో తన అందాలు, మైండ్ గేమ్‌తో అభిమానులను ఆకట్టుకున్న దీప్తి సునైన హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా తన హవా కొనసాగించారు. తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ స్టోరీ ఈ భామకు యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. బయట ఉన్నంత కాలం షణ్ముఖ్‌తో బాగున్న దీప్తి.. అతను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత షాకిచ్చింది. హౌస్‌లో సిరి హనుమంత్, షణ్ముఖ్‌లు క్లోజ్‌గా ఉండటంతో దీప్తితో బంధానికి బీటలు వారింది. షన్నూ బయటికి వచ్చిన కొద్దిరోజులకే దీప్తితో విభేదాలు మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి. కొద్దిరోజులకు వాటిని నిజం చేస్తూ ఇద్దరూ సోషల్ మీడియాలో బ్రేకప్ పోస్ట్ పెట్టారు.
బిగ్‌బాస్ ద్వారా నేర్చుకున్నానన్న దీప్తి
దీప్తి - షణ్ముఖ్ బంధంపై అప్పట్లో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి దీప్తి తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చింది. తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సమయానికి తన వయసు 20 సంవత్సరాలేనని.. ఆ సమయంలో తనకు సరైన మెచ్యూరిటీ లేదని, కానీ బిగ్‌బాస్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. అయితే దీప్తి - షణ్ముఖ్‌లు తిరిగి ఒక్కటవుతారని వారి అభిమానులు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో మెసేజ్‌లు పెడుతుంటారు.
కొత్త కారు కొన్న దీప్తి సునైన
షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేశారు. రీల్స్, షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ ఆల్బమ్స్‌పై జోరు పెంచారు. తన సంపాదనతోనే ఇల్లు కట్టుకుని పేరెంట్స్‌ను చాలా బాగా చూసుకుంటోంది దీప్తి. గతేడాది లగ్జరీ కారు కొనుగోలు చేసి షాకిచ్చింది. అయితే అందరు సెలబ్రెటీల మాదిరిగా బెంజ్, ఆడి అంటూ వెంట పడకుండా టయోటాలో హై ఎండ్ మోడల్ తీసుకుంది. అప్పట్లో దీని ధర రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుందని అంచనా.
వెకేషన్‌లో బిజీగా దీప్తి
ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్ వేసే దీప్తి సునైనలో దైవభక్తి కూడా ఎక్కువే. వీలున్నప్పుడల్లా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. మొన్నామధ్య మోచేతిపై పరమేశ్వరుడి టాటూను వేసుకుని కనిపించింది. ఇకపై నాకు అంతా ఆయనేనంటూ దీప్తి పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో తొలి నుంచి యాక్టీవ్‌గా ఉండే దీప్తి సునైన ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా చీర కట్టుకుని వింటేజ్ లుక్‌లోకి మెరిసింది. టేప్ రికార్డర్ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











