Demon Pavan: నీలాంటోడే భర్తగా రావాలి... డిమోన్ పవన్ మాటలకు అమ్మాయిలు ఫిదా!
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో కామన్‌మెన్ కోటాలో హౌస్‌లో అడుగుపెట్టి తన సత్తాతో సెకండ్ రన్నరప్ వరకు వచ్చాడు డిమోన్ పవన్. గేమ్స్, టాస్క్‌లు ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ ఒకదశలో కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామిలకు సైతం గట్టి పోటీ ఇచ్చాడు. చివరిలో తల్లిదండ్రులు, కుటుంబ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌కు అంగీకరించి టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నాడు. అప్పుడు కూడా తన నిర్ణయంతో అందరినీ ఆకట్టుకున్నాడు డిమోన్ పవన్. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీబీ జోడీలో తన గర్ల్‌ఫ్రెండ్ రీతూ చౌదరితో సందడి చేస్తున్నాడు డిమోన్.
అథ్లెట్ అవ్వాలని బిగ్‌బాస్ వైపుకు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఉప్పాల పవన్ కుమార్ అలియాస్ డిమోన్ పవన్ తొలుత బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ చేశాడు. కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ తర్వాత అథ్లెటిక్‌గా స్థిరపడాలని భావించారు. అయితే దానికి సరైన మెరిట్ లేకపోవడంతో అతని ఆశలు ఫలించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇతర ప్రోగ్రామ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 9 కామనర్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసి ... అగ్నిపరీక్ష కాంటెస్ట్‌కు ఎంపికయ్యాడు. అక్కడ ఫిజికల్ టాస్క్‌లు, ఇతర ఈవెంట్స్‌లోనూ సత్తా చాటి తుది జాబితాలో నిలిచాడు. అప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ దక్కించుకున్న పవన్.. ఖచ్చితంగా కామనర్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెడతాడని అనుకున్నారు.

రీతూతో లవ్ ట్రాక్ వైరల్
బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ రోజున కంటెస్టెంట్‌గా డిమోన్ పవన్ పేరును నాగార్జున చెప్పగానే ఎంతో సంతోషించానని పవన్ చెప్పాడు. తన తల్లిదండ్రులు, సన్నిహితులు, ఫ్రెండ్స్ సపోర్ట్ ద్వారానే ఇక్కడి వరకు వచ్చినట్లు పవన్ తెలిపాడు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత బుల్లితెర సెలబ్రిటీ రీతూ చౌదరికి క్లోజ్ అయ్యాడు. ఎలాంటి పరిస్ధితుల్లోనూ ఆమెను విడిచిపెట్టకుండా అండగా నిలిచాడు. దాంతో రీతూకి పవన్‌కి మధ్య ప్రేమాయణం సాగుతోందని ఆడియన్స్ భావించారు. వీరిద్దరి లవ్ ట్రాక్ కూడా ఈసారి బిగ్‌బాస్ సీజన్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రీతూ, పవన్‌లు తమ రిలేషన్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి స్టార్ మాలో ప్రసారమవుతోన్న బీబీ జోడీ 2లో కంటెస్టెంట్స్‌గా పార్టిసిపెట్ చేస్తున్నారు.
మన పనులు మనమే చేసుకోవాలి
తొలి నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే డిమోన్ పవన్.. తాజాగా ఓ వీడియోను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాయ్ ఎవ్రీవన్ డే 5 ఆఫ్ 21 డే సిరీస్. ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్.. బేసిక్‌గా మనకి మన ఇంట్లో పనులు వచ్చి ఉండాలి. మన పని మనమే చేసుకోవాలి. మన ఫ్యామిలీకి సపోర్టివ్‌గా ఉంటూ, ఎవరూ లేనప్పుడు మనం ఇండిపెండెంట్‌గా మన పనులు మనం చేసుకోవాలి. ఇలా కనుక మనకు అలవాటైతే మనం ఎక్కడున్నా హ్యాపీగా ఇండిపెండెంట్‌గా బ్రతికేయొచ్చు. ఇప్పటికీ కూడా చాలామంది అబ్బాయిలు నేను ఇంట్లో పని, వంట పనులు చేయను, నేను ఆడింగోడిని కాదు అన్న మైండ్‌సెట్‌తో ఉంటారు. ఒక మనిషిగా మనం అర్ధం చేసుకోవాల్సి ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ అని డిమోన్ పవన్ అన్నాడు.
నీ క్వాలిటీస్ ఏంటో తెలుసుకో
ఒక హాజ్బెండ్‌లా నువ్వు నీ పార్ట్‌నర్‌కి కొన్నిసార్లయినా లేదా ఫ్రీ టైంలో సపోర్టివ్‌గా ఉన్నావంటే ఆమె చాలా సంతోషిస్తుంది. అది నువ్వు తనను ఎంత కేరింగ్‌గా చూసుకుంటున్నావో తెలియజేస్తుంది. ఇలా కనుక నువ్వు చేస్తే నీ పార్ట్‌నర్‌కి చాలా బాగా నచ్చేస్తావు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్‌ని ఇంకాస్త స్ట్రాంగ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇలా చేయడం మన పార్ట్‌నర్ గురించి మాత్రమే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. ఏ అబ్బాయినైనా, అమ్మాయినైనా మీ పార్ట్‌నర్ ఎలా ఉండాలని అడిగితే.. బాగుండాలి, అర్ధం చేసుకోవాలి, మంచిగా అర్ధం చేసుకోవాలి అని చెబుతారు. మనకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ మన లైఫ్‌లోకి రావాలంటే మన దగ్గర కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. కొంచెమైనా ఇంట్లో పనులు అందరూ నేర్చుకోండి. అవి మనకి ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతాయి. ముందు మీ దగ్గర ఏ క్వాలిటీస్ ఉన్నాయో చూసుకుని వాటిపై వర్క్ చేయండి అని డిమోన్ పవన్ చెప్పాడు.
నీలాంటి వాడే భర్తగా రావాలి
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతుండగా.. అమ్మాయిలు డిమోన్ పవన్ మాటలకు ఫిదా అయిపోతున్నారు. నాకు నీలాంటి వాడు భర్తగా రావాలని ఒకరు, రీతూ లక్కీ అని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు. నీలో ఈ క్వాలిటీస్‌కే పడిపోయారు ఆడియన్స్. ప్రతి తల్లిదండ్రులు నీలాంటి కొడుకుని, ప్రతి అమ్మాయికి నీలాంటి వాడే భర్తగా రావాలని చెప్పింది. మీలా అందరూ అబ్బాయిలు ఆలోచిస్తే అసలు బ్రేకప్స్, డివోర్స్ అవ్వవు అని మరొకరు కామెంట్ పెట్టారు.


Click it and Unblock the Notifications











