బిగ్‌బాస్ డీమాన్ పవన్ సర్‌ప్రైజ్.. అమ్మకు అదిరిపోయే గిఫ్ట్..

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 డీమాన్ పవన్ (Demon Pawan).. అగ్నిపరీక్ష షో ద్వారా కామనర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. తన ఆట, మాట, ఎమోషన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో సాధారణ కంటెస్టెంట్‌గా కనిపించిన అతను.. క్రమంగా తన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని టాప్-3 వరకు చేరడం విశేషం. ముఖ్యంగా రీతూ చౌదరితో అతని లవ్ ట్రాక్ యువతను బాగా ఆకట్టుకుంది. అయితే రీతూ ఎలిమినేట్ అయిన తర్వాత పవన్ ఆట పూర్తిగా మారిపోయింది. మరింత స్ట్రాంగ్‌గా ఆడుతూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తాజాగా డిమాన్ పవన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పవన్ ప్రయాణం చాలా ఎమోషనల్ గా సాగింది. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించి బయటకు రావడం అప్పట్లో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. విజేత కాలేకపోయినా.. ప్రేక్షకుల ప్రేమను మాత్రం గెలుచుకున్నాడు పవన్. షో ముగిసిన తర్వాత కూడా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా కంటెంట్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు.

Bigg Boss Fame Demon Pawan Gifts Luxury Car to Mother on Mother s Day

ఇటీవల అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా డీమాన్ పవన్ చేసిన పని ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. చాలా మంది సెలబ్రిటీలు తమ తల్లులకు గిఫ్ట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా.. పవన్ మాత్రం తన తల్లికి ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

వీడియోలో ముందుగా తన తల్లిని ఎంతో ప్రేమగా "ఏ కలర్ కారు కావాలి?" అని అడిగాడు పవన్. ఆమె మెరూన్ కలర్ చెప్పడంతో అదే రంగులో ఉన్న టొయోటా హైరైడర్ కారును ఎంపిక చేశాడు. అనంతరం చిన్నగా సెలబ్రేషన్ నిర్వహించి కేక్ కట్ చేయించాడు. తర్వాత తన తల్లిని కొత్త కారులో కూర్చోబెట్టి ఎమోషనల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ క్షణంలో పవన్ తల్లి ఆనందంతో కనిపించిన ఎమోషన్స్ నెటిజన్లను కదిలించాయి.

ఈ వీడియోకు పవన్ రాసిన ఎమోషనల్ క్యాప్షన్ మరింత వైరల్ అయింది. 'నా జీవితంలో తెలిసిన అత్యంత అద్భుతమైన మహిళకు మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు ఎప్పుడూ అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నీ ప్రేమ నన్ను ఎప్పుడూ నిలబెట్టింది. నీ బిడ్డగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నువ్వు చేసిన ప్రతి త్యాగానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను' అంటూ తల్లిపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. చివరగా 'ప్రపంచంలోని ప్రతి మహిళకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు' అంటూ ప్రత్యేకంగా విషెస్ చెప్పాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. పవన్ అభిమానులు మాత్రమే కాదు.. బుల్లితెర సెలబ్రిటీలు కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రీతూ చౌదరి, ఆర్జే చైతు, మర్యాద మనీష్, ఆకుల సోనియా వంటి పలువురు సెలబ్రిటీలు "కంగ్రాట్స్", "సూపర్ గిఫ్ట్", "అమ్మ కోసం చేసిన బెస్ట్ పని" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ కొనుగోలు చేసిన టొయోటా హైరైడర్ కారు ధర కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మార్కెట్‌లో ఈ కారు ధర సుమారు రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని సమాచారం. బిగ్‌బాస్ తర్వాత తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంటున్న పవన్.. ఇప్పుడు తన తల్లికి ఇచ్చిన ఈ గిఫ్ట్‌తో మరింత అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

Read more about: bigg boss telugu Demon Pavan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X