తండ్రి మరణంపై ఫేక్ న్యూస్.. బిగ్‌బాస్ డిమాన్ పవన్ ఆవేదన .

Demon Pawan: డిమా‌న్ ప‌వ‌న్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బిగ్ అగ్నిపరీక్ష ద్వారా సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ డిమాన్ పవన్. బీబీ హౌస్ లో తన తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చివరికి టాప్-3లో నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే.. ఇటీవల డిమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన తండ్రి దుర్గా ప్రసాద్ మార్చి 10న కన్నుమూశారు. ఈ ఘటనతో తన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే.. ఈ నేపథ్యంలో తన తండ్రి మరణంపై తప్పుడు వార్తలు రావడంపై డిమాన్ పవన్ తీవ్రంగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా డిమాన్ పవన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికై బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన డిమాన్.. తన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో మంచి ఆట ఆడుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్‌గా ఎంపికై తన నాయకత్వ లక్షణాలను కూడా చూపించాడు. తన స్ట్రాంగ్ గేమ్‌తో ఫైనల్ దశ వరకు చేరి టాప్-3లో నిలిచాడు. అయితే ఆ సమయంలో తన తండ్రి వైద్య ఖర్చులు గుర్తొచ్చి కీలక నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించి షో నుంచి బయటికి వచ్చాడు. ఈ నిర్ణయం ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురిచేసింది.

Bigg Boss Fame Demon Pawan Reacts to Fake News and Thumbnails After Father s Death

కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో కింగ్ నాగ్‌తో మాట్లాడిన సందర్భంగా డిమాన్ పవన్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి భావోద్వేగంగా వెల్లడించారు. తన తండ్రి దుర్గాప్రసాద్ నోటి క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్నారని చెప్పారు. చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆయన పూర్తిగా లిక్విడ్ డైట్‌పైనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ఆరోగ్యం చాలా బలహీనంగా ఉన్నప్పటికీ, నోటితో సరిగా మాట్లాడలేని పరిస్థితిలో కూడా తన కుమారుడు డిమాన్ పవన్‌కు బిగ్ బాస్‌లో మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారని చెప్పారు. తన కొడుకు గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతోనే తాను బిగ్ బాస్ షోలో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని డిమాన్ పవన్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. తన తండ్రి మరణంపై తప్పుడు వార్తలు రావడంపై డిమాన్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. కొంతమంది కంటెంట్ క్రియేటర్లు తన కుటుంబ విషాదాన్ని వ్యూస్ కోసం ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ సందేశం షేర్ చేస్తూ స్పందించారు.తన తండ్రి మరణాన్ని కంటెంట్‌గా మార్చి వ్యూస్ కోసం ఉపయోగించవద్దని డిమాన్ పవన్ స్పష్టంగా కోరారు. 'దయచేసి నా తండ్రి మరణాన్ని వ్యూస్ కోసం కంటెంట్‌గా మార్చకండి. కొంతమంది ఫేక్ థంబ్‌నెయిల్స్, తప్పుడు కథలు పెట్టి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి పనులు ఆపండి' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా తన తండ్రి మరణ సమయంలో ఎవరూ ఆర్థికంగా సహాయం చేయలేదని కూడా చెప్పారు. 'నా తండ్రి అంత్యక్రియలను నేను స్వయంగా నిర్వహించాను. కొంతమంది ఫోన్ చేసి ధైర్యం చెప్పినందుకు వారికి ధన్యవాదాలు'అని ఆయన తెలిపారు. అలాగే తన తండ్రి అంత్యక్రియలకు వచ్చి తనతో నిలబడ్డ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో కొన్ని సందర్భాలు ఎంతో గౌరవంగా చూడాల్సినవని, వాటిని వ్యూస్ కోసం ఉపయోగించడం బాధాకరమని డిమాన్ పవన్ అన్నారు. 'జీవితంలో కొన్ని క్షణాలు గౌరవానికి అర్హమైనవి. వాటిని వ్యూస్ కోసం మార్చకండి' అంటూ ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X