బీచ్‌లో దేత్తడి హారిక హాట్ షో: క్లోజప్‌లో అందాలను చూపిస్తూ రచ్చ
సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో క్యూట్ బ్యూటీ దేత్తడి హారిక ఒకరు. యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షో తర్వాత మరింతగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో దేత్తడి హారిక సోషల్ మీడియాలోనూ మరింతగా సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ రీల్‌ను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి!

‘దేత్తడి' వీడియోలతో రచ్చ
ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అలేఖ్య హారిక ఫేమస్ అయింది. 'దేత్తడి' అనే ఛానెల్‌తో వచ్చిన ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. వీటిలో ఆమె విలక్షణమైన నటనను కనబరిచి ఆకట్టుకునేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీ పేరు సంచలనం అయింది.

బిగ్ బాస్‌తో ఆమె క్రేజ్ డబుల్
సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన హారికకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే నిర్వహకులు ఇచ్చిన టాస్క్ వల్ల యంగ్ హీరో అభిజీత్‌కు క్లోజ్ అయింది. అప్పటి నుంచి అతడితో ట్రాక్ నడిపి హాట్ టాపిక్‌గా మారింది. ఇలా హారిక ఎప్పుడూ అతడితోనే ఉంటూ వార్తల్లో నిలవడంతో పాటు క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.

షో వల్ల డబ్బు, మంచి పేరుతో
దేత్తడి హారిక బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇలా ఫినాలేకు కూడా చేరుకుంది. అంతేకాదు, బిగ్ బాస్ వల్ల దాదాపు రూ. 40 లక్షలు వరకూ సంపాదించినట్లు ప్రచారం జరిగింది.

ఎన్నో సినిమాలు.. వాటిలోనూ
బిగ్ బాస్‌లో దేత్తడి హారిక అదరగొట్టడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే దీని తర్వాత ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం దేత్తడి హారిక ఫుల్ బిజీగా గడుపుతోంది. మరీ ముఖ్యంగా 'వరుడు కావలెను' అనే సినిమాలో ఆమె తనదైన శైలి యాక్టింగ్‌తో అలరించింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
దేత్తడి హారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె పాపులర్ అవడానికి కారణమే అది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. ఫలితంగా నిత్యం హైలైట్ అవుతూ ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంటోంది.
అందాలు ఆరబోస్తూ సందడి
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సందడి చేసే దేత్తడి హారిక.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.

హారిక ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్
బిగ్ బాస్ తర్వాత మరింత డోస్ పెంచేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న దేత్తడి హారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ రీల్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో స్లీవ్‌లెస్ టాప్‌లో బాడీ కనిపించింది. ఫలితంగా క్లీవేజ్, నాభి, థైస్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో హారిక వదిలిన ఈ రీల్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది తెగ వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











