నగ్నంగా మీరు ఎప్పుడైనా? యాంకర్ నిఖిల్ తింగరి ప్రశ్న.. దివి దిమ్మతిరిగే జవాబు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించి సెలబ్రెటీగా ఎదిగింది దివి వైద్య. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దివి. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఉన్న పిచ్చితో వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టకుండా ప్రయత్నాలు ప్రారంభించి సక్సెస్ కొట్టింది. ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా తన మైండ్ గేమ్, ఆటతీరుతో ఈ మెగా రియాలిటీ షోలో ఓ వెలుగు వెలిగింది. అలాంటి దివికి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ క్వశ్చన్ ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..
చిరంజీవి ఆఫర్
ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది దివి. అందచందాలతోనే కాకుండా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ తన యాటిట్యూడ్‌తో ఎంతోమందిని బుట్టలో వేసుకుంది. బిగ్‌బాస్ సీజన్ 4లో తన ప్రయాణం ఎక్కువ రోజులు సాగకపోయినప్పటికీ షార్ట్ గ్యాప్‌లోనే గుర్తింపు సంపాదించుకుంది. బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మనసు గెలుచుకుంది దివి వైద్య. తాను త్వరలో నటించబోయే సినిమాలో అవకాశం ఇస్తానని స్టేజ్ మీద చిరంజీవి నుంచి హామీ పొందిన దివి.. గాడ్‌ఫాదర్‌లో అవకాశం దక్కించుకున్నారు.

వరుస సినిమాలలో దివి బిజీ
గాడ్‌ఫాదర్‌లో చిన్న పాత్రలోనే నటించినప్పటికీ .. నయీం డైరీస్ చిత్రంలో దివి రెచ్చిపోయింది. రొమాంటిక్ సీన్స్‌లోనూ హద్దులు దాటి మరి నటించి షాకిచ్చింది. ఆ తర్వాత లంబసింగి.. మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్‌లతో దివి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2లో రిపోర్టర్‌గానూ, డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణకు అనుచరురాలిగానూ నటించింది. గుర్తుండిపోయే పాత్ర ఏదైనా చేయాలని ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం మరిన్ని సినిమాలలో ఆమె బిజీ అయ్యారు.
దివికి ఆ ఘనత
బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన దివి వైద్యకు గతంలో 2020లో అరుదైన గుర్తింపు లభించింది. టీవీ పరిశ్రమకు సంబంధించి మోస్ట్ డిజైబుల్ ఉమెన్‌గా దివి నిలిచారు. శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్ టాప్ యాంకర్లను సైతం పక్కనపెట్టి అప్పట్లో దివి ఈ ఘనతను దక్కించుకోవడం గమనార్హం. దీనిపై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ.. ప్రజలు నా అందం కన్నా.. నా గుణాన్ని ప్రేమించారని, బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దివి వైద్య .. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు.
యాంకర్ నిఖిల్ తింగరి ప్రశ్న
యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిఖిల్ విజయేంద్ర సింహ నిర్వహించిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దివి వైద్య, దెత్తడి హారికలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిఖిల్ అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ బిత్తరపోయారు. బట్టలు లేకుండా ఎప్పుడైనా ఫోటోలు తీసుకున్నారా అని నిఖిల్ అడగ్గా.. నీ అసలు ఇంటెన్షన్ ఇది, ఇది ముందు అడగాలి కదా అని హారిక కౌంటర్ ఇచ్చింది. నువ్వేం చెబుతావా?అని దివి ఎదురుచూస్తోందని నిఖిల్ అంటాడు. నేనైతే తీసుకున్నానని ఓపెన్‌గా చెప్పేసింది హారిక. వీరిద్దరి వాదనతో దివి షాకైపోయింది. అక్కడితో ఆగకుండా మీకు ఎవరైనా? ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, వాట్సాప్‌లో కానీ ప్రైవేట్ ఫోటోల్ని పంపారా ? అని నిఖిల్ మరో చెత్త ప్రశ్న అడిగాడు. దీనికి ఏమాత్రం తడుముకోని దివి, హారికలు.. బోల్డెన్నీ సార్లు, బోల్డెంత మంది పంపారని ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదేం ఇంటర్వ్యూరా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications










