అందుకే బాయ్ ఫ్రెండ్ దొరకడం లేదు.. డేటింగ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ కామెంట్స్‌

Bigg Boss Fame Divi Vadthya: బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ హైదరాబాద్ అమ్మాయి, 2019లో మహేష్ బాబు నటించిన మహర్షితో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు లో పాల్గొని తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంది. 'ఏ 1 ఎక్స్‌ప్రెస్', 'రుద్రాంగి', 'లంబసింగి' వంటి చిత్రాలతో పాటు పుష్ప 2 వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న దివి, తాజాగా ప్రేమ, పెళ్లి, డేటింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

దివి వాద్య తాజాగా కిసిక్ టాక్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌లో బిగ్‌బాస్ ఎంత కీలకమో వివరంగా చెప్పిన దివి, ఆ షో వల్లే తన జీవితం పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేసింది. బిగ్‌బాస్‌కు ముందు తాను కేవలం మోడల్ మాత్రమేనని, వాస్తవానికి మోడలింగ్ వల్లే బిగ్‌బాస్ అవకాశం వచ్చిందని దివి తెలిపింది. బిగ్ బాస్ కంటే ముందుగానే మహర్షి సినిమాలో నటించిననీ, అలాగే.. బిగ్‌బాస్‌కు వచ్చే సమయానికి తాను చేసిన సినిమాలు ఏవీ విడుదల కాలేదని గుర్తు చేసింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ, అవి రిలీజ్ కాకపోవడంతో కెరీర్‌కు సరైన బ్రేక్ రాలేదని చెప్పింది.

Bigg Boss Fame Divi Vadthya Bold Comments On Dating Marriage And Living Relationship Go Viral

అయితే బిగ్‌బాస్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని దివి వెల్లడించింది. ఆ షో వల్ల వరుసగా ఆఫర్స్ వచ్చాయని, వాటిలో తొలి ముఖ్యమైన అవకాశం లంబసింగి అని చెప్పింది. కానీ ఆ సినిమా మూడు సంవత్సరాల తర్వాత విడుదల కావడంతో, తాను ఊహించిన స్థాయిలో కెరీర్ మలుపు రాలేదని స్పష్టంగా చెప్పింది. ఆ సినిమా వెంటనే రిలీజ్ అయి ఉంటే తన జర్నీ మరోలా ఉండేదని అభిప్రాయపడింది. ఆ తర్వాత 'ఏటీఎం', 'సింబ' వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసే అవకాశాలు వచ్చాయని, అవకాశాలు వస్తున్నాయన్న నమ్మకంతోనే ఎప్పుడో ఒక రోజు సక్సెస్ వస్తుందనే ఆశతో లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పింది.

తాను నటించిన సినిమాల్లో చాలా వరకు పెద్ద హిట్స్ కాలేదని, తన పాత్రలకు అంతగా గుర్తింపు రాలేదని దివి నిజాయితీగా ఒప్పుకుంది. ఇప్పటికీ తాను చిన్న సినిమాల హీరోయిన్‌గానే కొనసాగుతున్నానని చెప్పింది. అయినా అవకాశాలు వస్తున్నంత వరకు ఆగకుండా ముందుకు సాగుతున్నానని పేర్కొంది. ఇలాంటి పాత్రలు ఎందుకు వస్తున్నాయన్న ప్రశ్నకు స్పందిస్తూ, తన హైట్ కారణంగా కొన్ని అగ్రెసివ్ క్యారెక్టర్లు వస్తున్నాయని వివరించింది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో కూడా నటిస్తున్నానని చెప్పింది. యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా వెనుకాడకుండా పాల్గొంటున్నానని, అందుకోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇక హైట్ విషయంపై యాంకర్ వర్ష అడిగిన ప్రశ్నలకు దివి ఫన్నీగా స్పందించింది. సాధారణంగా అబ్బాయిలు 5.8 ఎత్తు ఉన్నారంటేనే ప్రత్యేకంగా ఫీల్ అవుతారని, అలాంటిది అమ్మాయి 5.8 ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది. అందుకే తనకు ఇప్పటివరకు 6 ఫీట్ ఉన్న అబ్బాయి దొరకలేదని, హైట్ ప్రాబ్లం వల్లే తాను ఇంకా సింగిల్‌గా ఉన్నానని నవ్వుతూ సమాధానమిచ్చింది. దీనిపై యాంకర్ వర్ష 'దివి సింగిల్' అంటూ మసాలా జోడించి అనౌన్స్ చేయగా, 'సిక్స్ ఫీట్ ఉన్న అబ్బాయి ఎవరైనా మా దివికి లైన్ వేసుకోవచ్చు' అంటూ మరో ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ఇలా దివి కెరీర్ స్ట్రగుల్‌తో పాటు ఆమె పర్సనల్ థాట్స్ కూడా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X