‘సింగిల్‌గా అయినా ఉండిపోతా... అలాంటి వాడు నాకొద్దు’
బిగ్‌బాస్ షో ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఇలాంటి వారిలో దివి వైద్య ఒకరు. చిన్నా చితకా పాత్రల్లో నటిస్తూ వచ్చిన దివి.. ఈ ఫేమ్‌తోనే బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ అందుకుంది. దూకుడు, వ్యక్తిత్వం, అందంతో హౌస్‌లో రెచ్చిపోయిన దివికి ఆడియన్స్ బలంగా నిలిచారు. బిగ్‌బాస్ కారణంగా ఆమె ఫేమ్ పెరగడంతో సినిమాలలో అవకాశాలు క్యూకట్టాయి. మహార్షి, ఏ 1 ఎక్స్‌ప్రెస్, గున్నీ, ఏటీఎం, గాడ్‌ఫాదర్, క్యాబ్ స్టోరీస్, నయీమ్ డైరీస్, జిన్నా, రుద్రాంగి, లంబసింగి, సింబా, పుష్ప 2, డాకు మహారాజ్, హనీ తదితర సినిమాలలో నటించింది దివి.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దివి వైద్య.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు. వయసు పెరుగుతున్న ఇప్పటికీ సింగిల్‌గా ఉంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు దివి. సినిమాలతో పాటు అప్పుడప్పుడు టీవీ షోలలో పాల్గొంటూ అల్లరి చేస్తుంది. తాజాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో సందడి చేయడంతో పాటు పెళ్లి, రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దివి వైద్య. ఈ వివరాల్లోకి వెళితే..

వారం వారం వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలతో ఆటలు ఆడిస్తూ, పాటలు పాడిస్తూ ఆదివారం విత్ స్టార్ మా షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు శ్రీముఖి. తాజాగా ఈ వారం కూడా సరికొత్త థీమ్, అల్లరితో వచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వారం బ్యాచిలర్ పార్టీ అనే థీమ్‌తో మీ ముందుకు వచ్చేశామంటూ శ్రీముఖి గోలగోల చేసింది. ఆ వెంటనే సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇచ్చారు. బ్యాచిలర్స్ అందరికీ బట్టలు ఉతకడం, అంట్లు తోమడం లాంటి టాస్క్ ఇస్తుంది శ్రీముఖి.
ఈ టాస్క్‌లో నిఖిల్ విజయేంద్ర సింహని చూడగానే నాకెందుకో వీడు లేచిపోయి పెళ్లి చేసుకుంటాడని అనిపిస్తోందని అంటుంది శ్రీముఖి. వాడైనా లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నాడు.. మీరు ఇక్కడున్నా చేసుకోవడం లేదని అవినాష్ పంచ్ విసురుతాడు. ఆ వెంటనే అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ ముగ్గులు వేసే టాస్క్ ఇస్తుంది శ్రీముఖి. అలాగే సెలబ్రిటీలను మధ్యలో నిలబెట్టి.. వాళ్లని వాటర్ బెలూన్స్‌తో కొట్టిస్తుంది.
నువ్వు బ్యాచిలర్‌వా అని దీపిక రంగరాజుని అడగ్గా.. నేను బ్యాచిలర్ కాదు, మాస్టర్స్ చేసి పీహెచ్‌డీ కూడా కంప్లీట్ చేశానని చెబుతుంది. ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నందుకే బ్యాచిలర్‌గా ఉండిపోయావని ఎక్స్‌ప్రెస్ హరి సెటైర్లు వేస్తాడు. అలాంటి అబ్బాయి అయితే ఓకే అని ఎక్స్‌ప్రెస్ హరి వైపు చూపించి అడుగుతుంది శ్రీముఖి. దానికి దివి స్పందిస్తూ.. అలాంటి అబ్బాయి వస్తే సింగిల్‌గా ఉండిపోతానని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఆ షాక్‌లో నుంచి తేరుకున్న ఎక్స్‌ప్రెస్ హరి.. అవమానించారని అంటాడు. నువ్వు జేబులో చేయిపెట్టి గోక్కుంటుంటే అనరా అంటూ శ్రీముఖి పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. దివి వైద్యకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా అబ్బాయి కావాలో చెప్పిందో లేదో తెలియాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications


