చేతబడులు నిజమే.. ఆ రోజున నా శరీరంలో వింత మార్పులు... బిగ్‌బాస్ బ్యూటీ కామెంట్స్

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తూ.. త్వరలో గగన్‌యాన్ వంటి ప్రయోగానికి సిద్ధమవుతూ సూపర్‌ పవర్‌గా ఎదుగుతోంది భారతదేశం. కానీ మనదేశంలో ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. దెయ్యాలు, భూతాలు, చేతబడులు, బాణామతి, చిల్లంగి వంటి క్షుద్రపూజలను విశ్వసించే వారు.. వాటి కోసం నరబలులు ఇచ్చేవారు సైతం ఉన్నారంటే అతిశయోక్తి లేదు. గ్రామీణులు, నిరక్ష్యరాస్యులే కాదు.. బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతులు, నగరవాసుల్లోనూ ఈ నమ్మకాలు బలంగా ఉన్నాయి. అయితే కొందరు వీటిని కొట్టిపారేస్తూ జనాన్ని చైతన్యం చేయడానికి కృషి చేస్తున్నారు. తాజాగా చేతబడులు, ఇతర క్షుద్ర ప్రయోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బిగ్‌బాస్ బ్యూటీ. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌తో ఫేమ్
సదరు బిగ్‌బ్యూటీ ఎవరో కాదు.. దివి వైద్య. హైదరాబాద్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ... మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్‌తో మరింత పాపులరైన దివి.. తర్వాత ఏ1 ఎక్స్‌ప్రెస్, రుద్రాంగి, పుష్ప 2, డాకు మహారాజ్ వంటి భారీ సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా నటించినప్పటికీ అవి విడుదల కాకపోవడంతో తనకు సరైన క్రేజ్ దక్కలేదని పలుమార్లు వాపోయింది దివి.

Bigg Boss fame Divi Vadthya Opens Up About Black Magic Beliefs

క్షుద్రపూజల కాన్సెప్ట్‌తో హనీ
తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం హనీ. నవీన్ చంద్ర, దివ్యపిళ్లై జంటగా నటించారు. రాజా రవీంద్ర, జయత్రి, జయన్నీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల ఈ సినిమాను నిర్మించగా.. కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. నగేష్ బన్నేల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. అజయ్ ప్రసాద సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా నటుడు రాజా రవీంద్ర.. ఈ మూవీ టీమ్‌ని సరదాగా ఇంటర్వ్యూ చేశారు.

నా బిడ్డలు బతికొస్తారని వాదన
మదనపల్లెలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల నోట్లో చెప్పులు పెట్టి.. డంబెల్‌తో కొట్టి చంపేసింది. దాంతో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో, అధికారులతో ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే? వాళ్లు చనిపోలేదు.. ఇంకో మూడు రోజుల్లో లేచి వస్తారు, దేవుడి దగ్గర ఉన్నారని చెప్పింది. ఏడు ఎనిమిదేళ్లుగా వాళ్లు బయటి ప్రపంచంతో డిస్‌ కనెక్ట్ అయిపోయారు. వాళ్లు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు, పిల్లలు బయటికి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు ఇంటికి వస్తున్నారు. ఆమె ప్రొఫెసర్, ఇద్దరు పిల్లల్ని డంబెల్‌తో కొట్టి చంపేసినంత ఉన్మాదాన్ని ఎవరు వారికి ఇంజెక్ట్ చేశారు అన్న ఆలోచనలో నుంచి ఈ సినిమా కథ పుట్టిందని దర్శకుడు కరుణ కుమార్ తెలిపారు.

వాళ్లని కొట్టి చంపేసేవారు
చేతబడులు లాంటివి మీలో ఎవరికైనా పర్సనల్‌గా ఎదురయ్యాయా? ఎవరైనా మిమ్మల్ని చేతబడి చేసినట్లు అనిపించిందా? అని రాజా రవీంద్ర ప్రశ్నించాడు. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. మా ఊరు ఆంధ్రా - ఒడిషా బోర్డర్‌లో ఉంటుంది. ఒడిషాలో అది వెనుకబడిన ప్రాంతం. ఒడిషాలో చేతబడులు చేసేవాళ్లు, నమ్మేవాళ్లు చాలా ఎక్కువ. అలా మాపై చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం బాగా పడింది. వూళ్లో ఎవరికైనా బాగోకపోతే వాళ్లపై చేతబడులు చేశారని అనుకునేవాళ్లు. చేతబడులు చేశారని కొట్టి చంపేసిన వాళ్లని ఎంతో మందిని చూశా. అయితే బాగా చదుకున్న తర్వాత వీటిని నమ్మలేదని తెలిపారు.

ఇంటికి వెళ్లేసరికి వాంతులు
దివ్య వైద్య మాట్లాడుతూ.. నేను బేసిగ్గా నమ్ముతాను, ఇప్పటికీ కూడా నమ్ముతాను. చేతబడులు ఉన్నాయి.. ఇలాంటివన్నీ జరుగుతాయని నమ్ముతాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే.. ఇంటికి వెళ్లేసరికి వాంతులు లాంటివి అయినప్పుడు దిష్టి తీయించుకునే దానిని. ఖచ్చితంగా ఇలాంటివి నిజంగా ఉన్నాయని నమ్ముతాననని దివ్య తెలిపారు. ఇక హీరో నవీన్ చంద్ర విషయానికి వస్తే.. అతను సింగిల్ టేక్ ఆర్టిస్ట్.. సెకండ్ టేక్ కాస్తో కూస్తో నాకే కావాలి. ఈ సినిమాలో ఒక ఇంటిమేట్ సీన్ ఉంది. ఆ సమయంలో చాలా కంఫర్ట్‌గా చూసుకున్నాడు. సీన్ ఎలా చేద్దామని డిస్కస్ చేసేవాడు. నవీన్ ప్రతి సీన్‌లో ఇన్వాల్వ్ అయిపోతాడని దివి చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X