అందాలతో దివి ధగధగ .. గ్లామర్‌తో అలా కవ్విస్తున్న బ్యూటీ
బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతోమంది అప్‌కమింగ్ స్టార్స్‌కి ఒక వేదికలా పనిచేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది హౌస్‌లో అడుగుపెట్టి నేమ్ , ఫేమ్‌తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ఇలాంటి వారిలో దివి వైద్య ఒకరు. చిన్న చిన్న వేషాలు వేస్తూ అలా వచ్చిన పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి మరింత రచ్చ చేసింది. తన అందచందాలతో బిగ్‌బాస్ హౌస్‌కి మరింత గ్లామర్ అద్దింది.
హైదరాబాద్‌కు చెందిన దివికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే మక్కువ. ఆమె తల్లి, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. దివి ఎంటెక్ పూర్తి చేసి ఇష్టమైన సినిమాల్లోకి అడుగుపెట్టడానికి వీలుగా మోడలింగ్ వైపు వెళ్లారు. మోడల్‌గానే తన పాకెట్ మనీ సంపాదించుకునేది. అలా తొలిసారిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షిలో ఓ సీన్‌లో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో పాటు కొన్ని కవర్ సాంగ్స్‌లోనూ యాక్ట్ చేసింది.

బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈమెకు తన సినిమాలో ఆఫర్ ఇస్తానని మాట ఇవ్వడమే కాదు.. మాట నిలబెట్టుకున్నారు కూడా. చిరు నటించిన గాడ్ ఫాదర్‌లో దివి కనిపించింది. ఇక నయిం డైరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌లోనూ హద్దులు దాటి మరి నటించి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2 లోనూ, డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణకు అనుచరురాలిగానూ నటించి మెప్పించింది.
ఇప్పుడిప్పుడే దివికి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కుతున్నాయి. నవీన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లంబసింగిలో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోకపోయినా దివి నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇవికాక జీ5లో ప్రసారమైన మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్‌లతో ఆమె అలరించారు. కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్‌లో నటిస్తానని పలుమార్లు ప్రకటించింది దివి.
ఓ వైపు సినిమాలు, షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు దివి . తన వ్యక్తిగత విషయాలతో పాటు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులోనైనా, చీరకట్టులోనైనా ఎలాంటి దుస్తుల్లోనైనా సరే ఈమె అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా వింటేజ్ లుక్‌లో చేసిన పోస్ట్ ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. కెంపు రంగు చీరను బొడ్డు కిందకి కట్టి.. లాంతర్ వెలుతురులో మెరిసిపోతున్న అందాలను దివి పంచుకున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ బిగ్‌బాస్ బ్యూటీ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











