‘ఇప్పటికీ ప్రభాస్‌ అంటే పిచ్చి క్రష్.. మనసు పారేసుకొన్న బిగ్‌బాస్ బ్యూటీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. నటుడిగా కంటే ఓ వ్యక్తిగా ప్రభాస్‌ను ఇష్టపడే వారెందరో. కల్మషం లేని మనస్తత్వం, అందరూ బాగుండాలని ఆశించే వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఒక్కరు కూడా ప్రభాస్‌కి వ్యతిరేకంగా కానీ, ఆయన గురించి చెడుగా మాట్లాడేవారు కానీ లేరంటే అతిశయోక్తి కాదు. చివరికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ప్రభాస్‌ను ఎంతో పొగుడుతుంటారు. తాజాగా ప్రభాస్‌పై తన ఇష్టాన్ని బయపెట్టారు ఓ నటి. అంతేకాదు.. ఆయనను పెళ్లి చేసుకుంటానంటూ ప్రపోజల్ పెట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

బిగ్‌బాస్ ద్వారా పాపులరైన వారిలో దివి ఒకరు. తొలుత చిన్నా చితకా పాత్రలు పోషించిన దివి ఈ ఫేమ్‌తోనే బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ అందుకుంది. అక్కడ గేమ్స్, టాస్క్‌లతో దుమ్మురేపడంతో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది. అనంతరం మహార్షి, ఏ 1 ఎక్స్‌ప్రెస్, గున్నీ, ఏటీఎం తదితర సినిమాలలో నటించింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేముందు మెగాస్టార్ చిరంజీవి ఆమెకు తన సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే గాడ్ ఫాదర్‌ మూవీలో నటించింది.

Bigg Boss Fame Divi Vadthya revealed how She Proposed to Prabhas on Instagram

ఆ తర్వాత వెబ్ సిరీస్‌లు, ఓటీటీలలో నటించింది. గత కొంతకాలంగా దివికి పెద్ద సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప, డాకు మహారాజ్‌తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశం దక్కించుకుంటున్నారు దివి. ఇటీవల ఆమె నటించిన హనీ అనే హార్రర్ మూవీ రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దివి వైద్య.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Recommended For You
Bigg Boss: 3 నెలలైనా అందని ప్రైజ్‌మనీ.. బిగ్‌బాస్ విన్నర్ ఎమోషనల్ పోస్ట్
Bigg Boss: 3 నెలలైనా అందని ప్రైజ్‌మనీ.. బిగ్‌బాస్ విన్నర్ ఎమోషనల్ పోస్ట్

నేను అందంగా ఉంటానన్న సంగతి నాకు తెలుసు. ఆ విషయం చెబితే జనాలు నమ్మాలి కదా? ఎలాంటి డ్రెస్‌లైనా వేస్తానని డైరెక్టర్లకు తెలియాలి కదా? ఇంత డైట్ ఫాలో అయి, ఇంత ఫిట్‌నెస్‌గా ఉన్నానని ప్రేక్షకులకు చెప్పడానికే బోల్డ్‌గా ఫోటోషూట్స్ చేస్తున్నా. డైట్ ఎంత పక్కగా ఫాలో అవుతున్నా.. ఏం షూట్ లేనప్పుడు వండుకుని తినడం నాకు చాలా ఇష్టం. ఖాళీగా ఉంటే ఇంట్లో బోర్ కొడుతుంది. 48 గంటలు నిద్రపోకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఆ టైంలో నిద్రపోవడానికి ఛాన్స్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. వర్క్, పర్సనల్ లైఫ్‌ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం తెలుగులో 5 సినిమాలు, తమిళంలో 3 సినిమాలలో నటిస్తున్నా.. వర్క్ చేయడమే మన చేతిలో ఉంటుంది.. రిలీజ్ మన చేతిలో ఉండదు, 100 శాతం పనిచేయడమే మన చేతిలో ఉంటుంది. రిజల్ట్ బాగా రావాలనే పనిచేస్తామని దివి వైద్య పేర్కొన్నారు.

You May Also Like
ఇంటికి పిలిచి అవమానాలు... 23 రోజులు కొనఊపిరితో నా కోసమే.. తారకరత్న భార్య ఎమోషనల్
ఇంటికి పిలిచి అవమానాలు... 23 రోజులు కొనఊపిరితో నా కోసమే.. తారకరత్న భార్య ఎమోషనల్

సడెన్ సక్సెస్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు.. కానీ నాకంటూ ఓ ఫ్రైడే రావాలని కోరుకుంటున్నా. పుష్ప 2లో నా రోల్ పైన ట్రైలరే వచ్చింది. దాంతో నా రోల్ చాలా బాగుంటుందని అనుకున్నా.. కానీ సినిమా వచ్చేసరికి రిజల్ట్ వేరే. కానీ మన బాధ ఎవరు వింటారు. పుష్ప 2కి షూటింగ్‌లో 20 రోజులు పాల్గొన్నా.. డబ్బింగ్ కూడా చెప్పా.. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యా. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా.. ఇంకా చాలా చూడాలి, చాలా నేర్చుకోవాలి. కానీ చాలామంది నువ్వు అది, ఇది అంటూ నానామాటలు అంటున్నారు. ఈ జనాలను, సమస్యలను దాటుకుని పైకి రావాలి. ఇది లాంగ్ జర్నీ. మంచి వార్తను నేను ఎవరితోనూ షేర్ చేసుకోను.. ఎందుకంటే అది పోతుందని భయమని దివి వైద్య తెలిపారు.

బంగారాన్ని మించి బ్లూ డ్రమ్ముల ధరలు.. మహిళల మోజుపై నటి హేమ
బంగారాన్ని మించి బ్లూ డ్రమ్ముల ధరలు.. మహిళల మోజుపై నటి హేమ

ప్రభాస్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం మెసేజ్ చేశారని యాంకర్ అడగ్గా... నేను మెసేజ్ చేస్తే ఆయన చూసుకుంటారా ఏంటీ అని ప్రశ్నించింది దివి. ఆయన అంటే చాలా ఇష్టం. అందరూ చేసినట్లే నేను కూడా మెసేజ్ చేశాను. నేను యాక్టర్ కాకముందు ఆయనకు పంపించాను. మీరంటే చాలా ఇష్టం.. హౌ ఆర్ యూ అని మెసేజ్ పెట్టి ఉండొచ్చు. ప్రభాస్ గారు నాకు ఏకైక క్రష్. ప్రభాస్ గారు ఎంతో మంచివారు, మంచి మనసున్న మనిషి అని విన్నాను. నాకు ప్రభాస్ గారు కనిపిస్తే అలా చూస్తూ ఉండిపోతా. ఆయనతో వర్క్ చేయాలనుందని దివి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: bigg boss divi vadthya prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X