బిగ్ బాస్ దివి అరాచకం: అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ షో ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, దీని వల్ల చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు.

గతంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. బిగ్ బాస్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా యమ హడావిడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే దివి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరూ చూడండి!

అలా మొదలు.. ఫేమస్ కాలేదు

అలా మొదలు.. ఫేమస్ కాలేదు


సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాధ్యా మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు చిత్రం 'మహర్షి' కీలక పాత్రను పోషించింది. అయితే, ఇలా ఎన్నో చిత్రాల్లో మెరిసినా దివి మాత్రం ఫేమస్ కాలేకపోయింది.

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులారిటీ

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులారిటీ


సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి వాధ్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ పాపులర్ అయిపోయింది.

షో తర్వాత స్పీడుగా వెళ్తోంది

షో తర్వాత స్పీడుగా వెళ్తోంది


బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న దివి వాధ్యా.. ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీంతో షో నిర్వహకులపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. షోలో ఎలిమినేట్ అయినా దివికి మాత్రం సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆమె అందానికి ఫిదా అయిన చిరంజీవి.. 'భోళా శంకర్' సినిమాలో చాన్స్‌ ఇస్తున్నట్లు ఆ సీజన్ ఫినాలేలో ప్రకటించారు.

హాట్ సీన్ వైరల్.. ఫుల్ బిజీగా

హాట్ సీన్ వైరల్.. ఫుల్ బిజీగా


బిగ్ బాస్ షో తర్వాత దివి వాధ్యా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంత హైలైట్ అయింది. ఇది తెగ వైరల్ అవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమానే కాదు.. ఈ బ్యూటీ 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీని చేసింది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా


సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే దివి వాధ్యా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది. అలా తక్కువ సమయంలోనే క్రేజ్‌ను పెంచుకుంది.

అందాలను చూపిస్తోన్న దివి

అందాలను చూపిస్తోన్న దివి


వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న దివి వాధ్యా.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూనే ఉంటోంది.

చీరలో దివి అందాల ఆరబోత

చీరలో దివి అందాల ఆరబోత


అచ్చ తెలుగు అమ్మాయి దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు చీర కట్టుకుని మరీ అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఈ సొట్టబుగ్గల సుందరి నడుము, నాభి అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X