రోజులు లెక్కబెడుతున్నా .. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ పోస్ట్

సోషల్ మీడియా రాకతో పాపులర్ అయినవారు మన దగ్గర ఎంతో మంది ఉన్నారు. తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుని నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్న వారికి కొదవలేదు. ఈ కోవలోకే వస్తారు బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య. హైదరాబాద్‌కు చెందిన ఈ ముద్దగుమ్మ ఉన్నత విద్యావంతురాలు. ఎంటెక్ పూర్తి చేసిన ఈమె సినిమాలపై ఆసక్తితో మోడలింగ్‌ను దగ్గరి దారిగా ఎంచుకున్నారు. ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు తను కోరుకున్న రంగంలో రాణిస్తున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షిలో ఓ సీన్‌లో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో పాటు కొన్ని కవర్ సాంగ్స్‌లోనూ నటించింది. ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 4లో అవకాశం అందుకున్న దివి.. తన మైండ్ గేమ్, ఆటతీరుతో హౌస్‌లో హల్‌చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ టైటిల్ రేసులో వెనుకబడినా మంచి పాపులారిటీ సంపాదించింది.

bigg boss fame divi vadthya shares her manali vacation photos

బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈమెకు తన గాడ్ ఫాదర్‌ మూవీలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలను వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన నయీం డైరీస్‌లో ఛాన్స్ కొట్టేసింది దివి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌లోనూ హద్దులు దాటి మరి నటించి షాకిచ్చింది . ఓటీటీల రాకతో పలు వెబ్‌సిరీస్‌లలో అవకాశాలు అందుకున్న దివి ..జీ5లో ప్రసారమైన మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్‌లతో అలరించారు.

ఇప్పుడిప్పుడే దివి వైద్యకు భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2లో రిపోర్టర్‌గానూ, డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణకు అనుచరురాలిగానూ నటించి మెప్పించింది దివి. ఓ వైపు సినిమాలు, షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు దివి . తన వ్యక్తిగత విషయాలతో పాటు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది.

గత కొద్దిరోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పెడుతున్న ఫోటోలు, రాస్తున్న కొటేషన్స్ ఆమె అభిమానులకు షాకిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ..నాకేం ఆశ లేదు .. నీ సగ భాగం అవ్వాలని తప్ప, కోరికలు ఎక్కువ లేవు నీ రాత నా నుదిటిన రాయాలని తప్ప, ఆశలు అంతకన్నా లేవు.. నీతో ఉండాలని తప్ప, నా ఊపిరి ఆగిపోయిన రోజు నీ శ్వాసలో కలిసిపోవాలని తప్ప అంటూ దివి రాసుకొచ్చింది. దీంతో దివి ప్రేమలో పడిందా? లేక కవిత్వం ట్రై చేస్తుందంటా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రఖ్యాత మనాలి వెకేషన్‌కు వెళ్లింది దివి. అక్కడి మంచు కొండల్లో విహరిస్తూ , గ్రీన్ శారీలో తన నడుము, నాభి అందాలను చూపుతూ షాకిచ్చింది. అక్కడితో ఆగితే పర్లేదు. కానీ ఆమె రాసుకొచ్చిన కొటేషన్ షాకిస్తోంది. చూస్తున్నా .. రోజులు లెక్కబెడుతున్నా .. చెబుతా నీ సంగతి అంటూ గ్రీన్ కలర్‌లోని లవ్ ఎమోజీని పంచుకుంది. చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: divi vadthya movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X