Divi Vadthya: నాభి అందాలతో బిగ్ బాస్ దివి అరాచకం: అలాంటి పోజులో చూపిస్తూ!

తెలుగులో అశేషమైన పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ముందుగా ఇండియాలో హిందీలో ప్రారంభమైన ఈ షో 2017లో తెలుగులోనూ వచ్చింది. సెలబ్రిటీ షోగా వచ్చిన ఈ షోలో లైమ్ లైట్ లోకి రాని ఎంతోమందికి గుర్తింపు తీసుకొచ్చింది. చిన్న ఆర్టిస్ట్ లు సైతం పెద్ద సెలబ్రిటీలుగా మారే అవకాశం వచ్చింది. అలాంటి వారిలో ఒకరు సొట్ట బుగ్గల వయ్యారి దివి వాద్యా. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ చాలా పాపులర్ అయింది. బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ ద్వారా వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో ఆకర్షించే ఈ అమ్మడు తాజాగా మరో హాట్ పిక్ ను వదిలింది.

మహర్షి సినిమాతో రాని గుర్తింపు..

మహర్షి సినిమాతో రాని గుర్తింపు..

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ తనదైన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. మోడలింగ్ తర్వాత 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసింది. ఇలా ఎన్నో చిత్రాల్లో మెరిసినా దివి వాద్యా మాత్రం ఫేమస్ కాలేకపోయింది.

బిగ్ బాస్ షోలో అవకాశం..

బిగ్ బాస్ షోలో అవకాశం..

ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. అయినా దివికి మాత్రం సరైనా గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ పాపులర్ అయిపోయింది.

మెగాస్టార్ సినిమాలో ఆఫర్..

మెగాస్టార్ సినిమాలో ఆఫర్..

బిగ్ బాస్ రియాలిటీ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న దివి వాద్యా ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. షోలో ఎలిమినేట్ అయినా దివికి మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెను సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె అందానికి ఫిదా అయిన చిరంజీవి.. ఫినాలే సమయంలో 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇస్తున్నట్లుగా స్టేజీపైనే ప్రకటించారు.

నయూం డైరీస్ లో హాట్ గా..

నయూం డైరీస్ లో హాట్ గా..

అయితే చిరంజీవి భోళా శంకర్ సినిమా సంగతి తెలీదు గానీ దివి వాద్యా ఆయన నటించిన గాడ్ ఫాదర్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలా బిగ్ బాస్ షో తర్వాత దివి వాద్యా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో హైలైట్ అయింది. ఇది తెగ వైరల్ అవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

హీరోయిన్ గా కూడా..

హీరోయిన్ గా కూడా..

సినిమాలే కాకుండా మానీళ్ల ట్యాంక్, పరంపర 2 వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. అంతకుముందు క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో, లంబసింగి సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, సిరీస్ లే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది ఈ భామ. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది.

మరోసారి నాభి అందంతో రచ్చ..

మరోసారి నాభి అందంతో రచ్చ..

సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హల్ చల్ చేసే దివి వాద్యా తాజాగా మరో ఫొటోను వదిలింది. ఈ ఫొటోలో తన నాభి అందాన్ని చాలా ఘాటుగా చూపించింది బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి వాద్యా. గ్రే కలర్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న దివి.. తన నాభి కనపించేలా ఒక చేయి గోడకు, మరో చేతిన తన తలపై పెట్టుకుని వయ్యారంగా పోజు ఇచ్చింది. బ్లాక్ షేడ్స్ పెట్టుకుని గ్లామరస్ గా కనిపించింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X