For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దివి విషయంలో అనుకున్నదే జరుగుతోంది.. బిగ్ బాస్ బ్యూటీ దెబ్బకు వాళ్లంతా షాక్.!

  By Manoj Kumar P
  |

  దివి వద్యా.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. దీనికి కారణం ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడమే. అందులో అందంతో పాటు నిజాయితీగా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ సొట్టబుగ్గల సుందరి. ఈ సారి బిగ్ బాస్ టైటిల్ గెలిచే సత్తా ఆమెకు ఉంది అని అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా షో నుంచి ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో దివి విషయంలో ఊహించని వ్యవహారాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది షాక్‌కు గురవుతున్నారు. ఆ వివరాలు మీకోసం.!

  మహేశ్ బాబు మూవీలో నటించిన దివి

  మహేశ్ బాబు మూవీలో నటించిన దివి

  యాక్టింగ్ ఉన్న ఆసక్తితో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది తెలుగమ్మాయి దివి వద్యా. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు సొట్టబుగ్గలు ఉన్న ఈ అమ్మాయి మోడలింగ్ రంగంలో రాణించడంతో పాటు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే ‘లెట్స్ గో', ‘సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ మధ్య మహేశ్ చిత్రం ‘మహర్షి' కీలక పాత్రను పోషించి మెప్పించింది.

  బిగ్ బాస్‌ ఎంట్రీ.. సూపర్ గేమ్‌తో సత్తా

  బిగ్ బాస్‌ ఎంట్రీ.. సూపర్ గేమ్‌తో సత్తా

  అందంలో ఉత్తరాది వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే దివికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఆకట్టుకుందీ తెలుగు అమ్మాయి.

  ఊహించని విధంగా షో నుంచి అవుట్

  ఊహించని విధంగా షో నుంచి అవుట్

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి వద్యా క్రేజ్ అమాంతం రెట్టింపు అయింది. దీంతో ఆమె ఫైనల్ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు ముందే ఎలిమినేట్ అయిపోయింది. ఆ సమయంలో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.

  బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న దివి

  బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న దివి

  దివి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ షోపై విమర్శలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో ఓటింగ్ సరళిపై ప్రేక్షకులు సందేహాలు వెల్లగక్కారు. సరిగ్గా అప్పుడే దివి షోలోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగానే ఆమెను హౌస్‌లోకి తిరిగి పంపించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని ఓ క్లారిటీ వచ్చింది.

  దివి విషయంలో అనుకున్నదే జరిగింది

  దివి విషయంలో అనుకున్నదే జరిగింది

  కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీన్ని గ్రహించిన చాలా మంది ఫిల్మ్ మేకర్లు దివితో మూవీ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె రెండు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని చిత్రాలకు సంతకాలు చేసినట్లు తెలిసింది.

  బిగ్ బాస్ బ్యూటీ దెబ్బకు వాళ్లంతా షాక్.!

  బిగ్ బాస్ బ్యూటీ దెబ్బకు వాళ్లంతా షాక్.!

  తెలుగమ్మాయి కావడంతో దివికి టాలెంట్ ఉన్నా అవకాశాలు దక్కవని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ, దానికి భిన్నంగా ఆమె వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌ల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థతో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇలా దివి ఆఫర్లతో బిజీగా మారిపోవడంతో సినీ పెద్దలు షాక్ అవుతున్నట్లు వినికిడి.

  English summary
  The budding actress who played small roles in films and short films before entering the house of ‘Bigg Boss’ has now become a household name. Although she could not continue till the end, she gained popularity within no time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X