చిలకపచ్చ కోకలో బిగ్‌బాస్ దివి అరాచకం .. అలాంటి ఫోజుల్లో క్లీవేజ్ షో!

బిగ్‌బాస్ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చి సక్సెస్ కొట్టిన అతికొద్దిమందిలో దివి వైద్య ఒకరు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ హ‌ల్ చల్ చేస్తోంది. తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంటూ .. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కాకరేపుతోంది. ఆమె పెట్టె ఫోటోలకు ఫుల్ క్రేజ్ ఉంది. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన దివికి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ప్రాణం. ఎప్పటికైనా సినిమాల్లో అడుగుపెట్టి , స్టార్‌గా వెలుగొందాలని ఆమె ఎన్నో కలలు కన్నారు. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు దివి వైద్య. ఆమె తల్లి, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. దివి ఎంటెక్ పూర్తి చేసి మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. తన అవసరాలు, ఖర్చులకు కావాల్సిన డబ్బును ఆమె సంపాదించుకునేది. ఈ దశలో వంశీ పైడిపల్లి- సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన మహర్షిలో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు అందుకున్నా చెప్పుకోదగ్గ బ్రేక్ అందుకోలేదు.

bigg boss fame divi vadthya stunning pics with parrot color saree

కవర్ సాంగ్స్ చేస్తూ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తున్న దివి వైద్యకు బిగ్‌బాస్ తెలుగులో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని.. టాప్ 5లో ఉంటుందని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా దివి ఎలిమినేషన్ కావడం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. మోనాల్‌ను సేవ్ చేసేందుకు దివిని బలి చేశారంటూ బిగ్‌బాస్ లవర్స్ అప్పట్లో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టారు. బిగ్‌బాస్ హౌస్‌లో అమ్మ రాజశేఖర్‌తో క్లోజ్‌గా ఉన్న దివి.. మిగిలిన వారితో అంతగా కలవలేదు.

అయితే అమ్మ రాజశేఖర్‌పై ఫోకస్ పెట్టిన దివి.. తన సొంత గేమ్‌ను సరిగా ఆడటం మరిచిపోయిందని నెటిజన్లు మండిపడ్డారు. మిగిలిన వారితో అంతగా ర్యాపో మెయింటైన్ చేయకపోవడం ఆమెకు మైనస్‌గా మారిందని అప్పట్లో నెటిజన్లు చర్చించుకున్నారు. బిగ్‌బాస్‌లో 50 రోజులు ఉన్నానని, సమంత హోస్ట్‌గా రావడంతోనే తనను ఎలిమినేట్ చేశారని.. లేదంటే ఇంకొన్ని రోజులు ఉండేదాన్నని దివి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈమెకు తన గాడ్ ఫాదర్‌ మూవీలో చిన్న రోల్‌లో ఇప్పించి మాట నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దివికి సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలైంది.

ఇక నయీం డైరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌లోనూ హద్దులు దాటి మరి నటించి షాకిచ్చింది దివి. ఆ తర్వాత లంబసింగి.. జీ5లో ప్రసారమైన మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్‌లతో ఆమె అలరించారు. రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2లో రిపోర్టర్‌గానూ, డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణకు అనుచరురాలిగానూ యాక్షన్ సీన్స్‌తో మెప్పించింది దివి. ప్రస్తుతం మరిన్ని సినిమాలలో ఆమె బిజీ అయ్యారు. హాట్ హాట్ ఫోటోలతో సెగలు రేపే దివి వైద్య తాజాగా చిలకపచ్చ చీర కట్టుకుని బాల్కనీ నిల్చొని అందాల విందు చేశారు. నడుము మడతలతో యూత్‌ని కవ్విస్తూ ఓ కవితను రాసుకొచ్చారు. ప్రస్తుతం దివి వైద్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: divi vadthya movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X