Divi Vadthya: స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ దివి గ్లామర్ షో.. తడిచిన అందాలతో ఫ్యాన్స్‌కు ఊరింపు!

గతంలో తెలుగు అమ్మాయిలకు సినీ రంగంలో పెద్దగా అవకాశాలు దొరికేవి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికి కారణం ఇప్పుడు ఎంతో మంది లోకల్ యువతులు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది దివి వాద్యా ఒకరు.

సినిమా నటిగా పరిచయమైన ఆమె.. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. గుర్తించలే

అలా పరిచయం.. గుర్తించలే

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో ఛాన్స్‌లను కూడా దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి కనిపించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు.

బిగ్ బాస్‌తో ఫుల్‌గా పాపులర్

బిగ్ బాస్‌తో ఫుల్‌గా పాపులర్

కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో నటించినా దివి వాద్యాకు రావాల్సిన బ్రేక్ మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ ఆమె కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన దివి.. అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

కెరీర్‌ను మార్చిన బిగ్ బాస్ షో

కెరీర్‌ను మార్చిన బిగ్ బాస్ షో

రియాలిటీ షోలో చక్కని ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన దివి.. ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ షాక్ అవడంతో పాటు బిగ్ బాస్‌పై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమెకు మాత్రం ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలను కూడా ఒప్పుకుని బిజీ అయింది.

 ఫుల్ బిజీగా.. హాట్ సీన్ వైరల్

ఫుల్ బిజీగా.. హాట్ సీన్ వైరల్

బిగ్ బాస్ షోలో దివి అందానికి ఫిదా అయిన చిరంజీవి ఆమెకు 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఆమె 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో వైరల్ అయింది. దీంతో ఈ బ్యూటీ సంచలనంగా మారిపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీ

అందులో మాత్రం ఫుల్ బిజీ

నటిగా పరిచయం అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో దివి వాద్యా ఎంతో పాపులర్ అయింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది. దీంతో ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గా సెలెక్ట్ అయింది.

 గ్లామర్ ట్రీట్‌తో మాయ చేస్తూ

గ్లామర్ ట్రీట్‌తో మాయ చేస్తూ

కెరీర్ పరంగా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దివి వాద్యా సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో అందరికీ తెలుసు. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

స్విమ్మింగ్ పూల్‌లో సందడి

స్విమ్మింగ్ పూల్‌లో సందడి

బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడుపుతూ కనిపించింది. తడిచిన బట్టల్లో ఈ సొట్టబుగ్గల సుందరి అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో దివి వాద్యా ఫొటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X