Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తోడు కావాలంటూ బిగ్ బాస్ దివి పోస్ట్: ప్రతి శుక్రవారం రాత్రి తనతో అలా చేస్తానని ఆఫర్
చూడ చక్కని రూపం.. మైమరపించే నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సందడి చేస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది సొట్టబుగ్గల చిన్నది దివి వాద్యా. సినిమా నటిగా పరిచయమైన ఆమె.. ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేసింది. కానీ, పెద్దగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలోనే దివి సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు తనకు ఓ తోడు కావాలంటూ పోస్ట్ చేసింది. దీంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

అలా పరిచయం.. గుర్తింపు రాలేదు
మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన దివి వాద్యా.. ఎన్నో యాడ్లలోనూ నటించింది. ఇలా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో కనిపించింది. కానీ, గుర్తింపును పొందలేదు.
స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

బిగ్ బాస్‌తో మాత్రం ఫుల్ పాపులర్
వరుసగా ఎన్నో సినిమాల్లో నటించినా.. దివి వాద్యాకు కావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ ఆమె కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన దివి.. అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ అందరి దృష్టినీ ఆకర్షించి పాపులర్ అయిపోయింది.

కెరీర్‌ను మార్చిన షో.. చిరు ఆఫర్
బిగ్ బాస్ షోలో తన ఆటతీరుతో తెగ హైలైట్ అయిపోయిన దివి.. ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ షాక్ అవడంతో పాటు బిగ్ బాస్‌పై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమెకు మాత్రం ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే దివి అందానికి ఫిదా అయిన చిరంజీవి ఆమెకు 'భోళా శంకర్' సినిమాలో అవకాశాన్ని కల్పించారు.
ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

వరుస సినిమాలు.. ఆ హాట్ సీన్‌తో
బిగ్ బాస్ షో తర్వాత స్పీడు పెంచేసిన దివి వాద్యా.. ఇప్పటికే ఆమె 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో వైరల్ అయింది. దీంతో ఈ బ్యూటీ సంచలనంగా మారిపోయింది. ఫలితంగా మరిన్ని అవకాశాలను అందుకుంటూ సాగుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
సినిమాల్లోకి
ఎంట్రీ
ఇవ్వకముందు
నుంచే
దివి
వాద్యా
సోషల్
మీడియాలో
ఎంతో
పాపులర్
అయింది.
బిగ్
బాస్
తర్వాత
ఆమె
ఫాలోయింగ్
మరింతగా
పెరిగిపోయింది.
దీంతో
ఇందులో
ఎప్పుడూ
యాక్టివ్‌గా
ఉంటోన్న
ఈ
చిన్నది..
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫ్యాన్స్‌తో
షేర్
చేసుకుంటోంది.
ఇలా
గత
ఏడాది
మోస్ట్
డిజైరబుల్
ఉమెన్‌గా
ఎంపిక
అయింది.
Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!

తోడు కావాలంటూ పోస్ట్ చేసింది
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న దివి వాద్యా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో రచ్చ చేస్తుంది. ఇందులో భాగంగానూ తరచూ ఏదో ఒక పోస్టుతో ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి తనకు ఓ తోడు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె మరోసారి హాట్ టాపిక్ అవడంతో పాటు వార్తల్లో నిలిచింది.

శుక్రవారం రాత్రి అలా చేస్తానంటూ
తాజాగా దివి వాద్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'నాకు ఒక ఫుడ్ ఫ్రెండ్ కావాలి. తనతో ప్రతి శుక్రవారం రాత్రి ఒక రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ట్రై చేస్తాను' అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఆమెకు చాలా మంది తమను ఫ్రెండ్‌గా చేసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ హైలైట్ అవుతోంది.