Gangavva నూతన గృహప్రవేశం.. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన గంగవ్వ.. సెలబ్రిటీలు ఎవరెవరూ వచ్చారంటే...

మై విలేజ్ షోతో విశేషమైన అభిమానులను సొంతం చేసుకొన్న గంగవ్వ.. బిగ్‌బాస్‌ తెలుగు 4లోకి అడుగుపెట్టగానే పాపులారిటీ ఊహించని విధంగా పెరిగిపోయింది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే మరింత మంది అభిమానులను, సెలబ్రిటీల ఆదరణను చూరగొన్నారు. గంగవ్వకు బిగ్‌బాస్ ఊహించని విధంగా గ్రాఫ్ పెంచింది. బిగ్‌బాస్ ద్వారా గంగవ్వ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొనే వివరాల్లోకి వెళితే...

మై విలేజ్ షో ద్వారా బిగ్‌బాస్‌లోకి

మై విలేజ్ షో ద్వారా బిగ్‌బాస్‌లోకి

మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాస, భాషతో ఆకట్టుకోవడంతో గంగవ్వ బిగ్‌బాస్ నిర్వాహకుల దృష్టిలో పడ్డారు. బిగ్‌బాస్‌ను ఆఫర్‌ను తరలించిన తర్వాత ఆమెను క్వారంటైన్‌లో పెట్టారు. దాంతో కొంత అస్వస్థతతోనే ఆమె ఇంటిలోకి అడుగుపెట్టింది. అలా ఆమె దాదాపు ఐదువారాలకుపైనే ఇంటిలో సందడి చేశారు.

అనారోగ్యంతోనే మధ్యలో ఇంటికి

అనారోగ్యంతోనే మధ్యలో ఇంటికి

అయితే గంగవ్వ జ్వరంతో బాధపడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటిలోనే చికిత్స జరిపించారు. అయితే అయితే ఆమె ఆరోగ్యం కుదటపడకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే తాను ఇక ఇంటిలో ఉండలేనని గంగవ్వ కంటతడి పెట్టడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేందుకు బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు. అలా అర్ధాంతరంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్దపడ్డారు.

 ఇల్లు కట్టించమని నాగార్జునకు విన్నపం

ఇల్లు కట్టించమని నాగార్జునకు విన్నపం

ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన గంగవ్వ వేదిక మీద హోస్ట్ నాగార్జునతో ఓ కోరిక కోరింది. తనకు ఉండేందుకు ఇల్లు లేదని, బిగ్‌బాస్ ఇంటిని కట్టిస్తే తాను సుఖంగా ఉంటాను అని చెప్పుకొన్నది. దాంతో నాగార్జునతోపాటు బిగ్‌బాస్ నిర్వాహకులు ఇంటిని కట్టించేందుకు సిద్దమయ్యారు. అలా తన స్వగ్రామం జగిత్యాల జిల్లా లంబాడిపల్లిలోని ఇంటికి పునాది పడింది.

గంగవ్వ ఇల్లు ఎలా ఉందంటే..

గంగవ్వ ఇల్లు ఎలా ఉందంటే..

గత ఏడాదికాలంగా ఇంటి నిర్మాణాన్ని పకడ్బందీగా ప్లాన్ చేశారు. విశాలమైన ఇంటిని అధునిక సౌకర్యాలతో కట్టించారు. విశాలమైన హాల్, విశాలమైన మరో రెండు బెడ్రూంలు, అలాగే మంచి కిచెన్, పూజ గదితో మంచి ఇల్లును కట్టించారు. ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో మంచి రోజు చూసుకొని నవంబర్ 09వ తేదీన గృహ ప్రవేశం చేశారు. సంప్రదాయ పద్దతుల్లో పూజలు నిర్వహించి గృహ ప్రవేశం చేశారు. దాంతో గంగవ్వ సొంత ఇంటి కల సాకారమైంది.

సెలబ్రిటీలకు గంగవ్వ ఆహ్వానం

సెలబ్రిటీలకు గంగవ్వ ఆహ్వానం

తన ఇంటి గృహ ప్రవేశ శుభ కార్యక్రమానికి బిగ్‌బాస్ సహచరులను, సెలబ్రిటీలను గంగవ్వ ఆహ్వానించింది. అందరూ తన ఇంటిలో జరిగే శుభకార్యానికి వస్తానని మాట ఇచ్చారు అని గంగవ్వ తాజా గృహ ప్రవేశం సందర్భంగా మీడియాకు చెప్పారు. అయితే కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే గృహ ప్రవేశానికి హజరయ్యారు.

 అఖిల్ సార్థక్, సావిత్రి హాజరు

అఖిల్ సార్థక్, సావిత్రి హాజరు

గంగవ్వ గృహ ప్రవేశానికి అఖిల్, సావిత్రి తదితరులు హాజరయ్యారు. గృహ ప్రవేశం సందర్భంగా గంగవ్వకు పట్టువస్త్రాలు పెట్టారు. గంగవ్వకు అఖిల్ కుటుంబ సభ్యులు నూతన వస్త్రాలను పెట్టి పెట్టారు. ఇక సావిత్రి దంపతులు కూడా గంగవ్వకు ఇంటికి సంబంధించిన వస్తువులను, కిచెన్ సామాగ్రిని బహుకరించారు.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
లంబాడిపల్లిలో పండుగ వాతావరణం

లంబాడిపల్లిలో పండుగ వాతావరణం

అయితే గంగవ్వ గృహ ప్రవేశ కార్యక్రమంతో ఆమె సొంత గ్రామం లంబాడిపల్లిలో పండుగలాంటి వాతావరణం కనిపించింది. గ్రామస్థులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ కుటుంబ సభ్యులు, సావిత్రి దంపతులకు నూతన వస్త్రాలతో ఆశీర్వదించారు. ఇలా గృహ ప్రవేశ కార్యక్రమం గంగవ్వ జీవితంలో మధురమైన రోజుగా మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X