రానాకు బిగ్ బాస్ గంగవ్వ కల్లు దావత్.. నిషాలో నిజం చెప్పేసిన హీరో

తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. చక్కటి వీడియోలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గంగవ్వ. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె వృద్ధాప్యంలోకి వచ్చాక వీడియోలో నటించడం విపరీతమైన పాపులారిటీని సంపాధించుకోవడం చిన్న విషయమేమీ కాదు. యూట్యూబ్ లో ఫుల్ ఫేమస్ అయిన ఈమెను.. బిగ్ బాస్ హౌస్ కు తీసుకు వచ్చిన తర్వాత మరింత ఫాలోయింగ్ పెరిగింది.

ఆ తర్వాత నుంచి గంవవ్వకు అనే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. వరుస చిత్రాలతో పాటు బుల్లితెరపై కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గంగవ్వ చేసిన ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ వంటి సినిమాలు గంగవ్వను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. ఇక తాజాగా వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో అందరినీ మెప్పిస్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు ఇవి చాలవన్నట్లు సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొంటోంది.

Bigg boss fame Gangavva kallu dawath to Rana Daggubati

తాజాగా హీరో దగ్గుబాటి రానా తన సినిమా కోసం.. గంగవ్వ వద్దకు వచ్చాడు. ఈ సందర్భంగా రానాతో కల్లు తాగించి రచ్చ రచ్చే చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం రానా సమర్పణలో మసూద ఫేమ్ తిరువీర్ హీరోగా నటించి చిత్రం పరేషాన్. రూపక్ రోనాల్డోసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ 2వ తేదీన విడుదల చేయబోతున్నారు.

వాల్తేర్ ప్రొడక్షన్స్ పై సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మై విలేజ్ షో టీంతో సందడి చేశారు. పరేషాన్ టీంతో కలిసి గంగవ్వ ఊరికి వచ్చాడు. పల్లెటూరి వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశారు. దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. రానా చేత కల్లు తాగించింది. కల్లు తాగిన తర్వాత రానా ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో తెలియాలంటే.. మై విలేజ్ షో ఫుల్ వీడియో వచ్చే వరకు ఆగాల్సిందే.

Bigg boss fame Gangavva kallu dawath to Rana Daggubati

ఈరోజే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నమోదు అయ్యాయి. ఈ సినిమాలో తిరువీర్ సరసన పావని హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెర ఖాన్, రవి, రాజు బేడిగల, శృతి రాయన్, అంజి బాబు వాల్గమాన్, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత, సురభి రాఘవ, శివరామ్ మరియు సాయి కిరణ్ యాదవ్ లు కూడా నటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X