నా బిడ్డను దారుణంగా చంపేశారు.. గుండె పగిలెలా ఏడుస్తున్న గీతూ రాయల్

గీతూ రాయల్.. బిగ్‌బాస్ ద్వారా తెలుగువారికి బాగా దగ్గరైంది. అందం, చలాకీతనం, పంచ్ డైలాగ్స్‌తో అదరగొట్టే గీతూ రాయల్ బిగ్‌బాస్ రివ్యూయర్‌గా కెరీర్ ప్రారంభించి.. తక్కువ కాలంలోనే సెలబ్రెటీగా మారిపోయింది. చిత్తూరు యాసలో దంచేసే ఈ స్పెషల్ టాలెంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కోటాలో బిగ్‌బాస్‌ తెలుగు -6లో అవకాశం తెచ్చిపెట్టింది. తన మైండ్‌గేమ్, ఫిజికల్ టాస్క్‌ల్లో మేల్ కంటెస్టెంట్స్‌కు సైతం పోటీ ఇచ్చి టాప్ కంటెస్టెంట్‌గా డామినేట్ చేసింది. ఒకానొక దశలో ఈసారి బిగ్‌బాస్ విన్నర్‌గా గీతూ రాయల్ నిలుస్తుందని ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.

కానీ బిగ్‌బాస్ నిబంధనలను పక్కనబెట్టి.. తన రూల్స్‌తో గేమ్స్ స్టార్ట్ చేసింది. ఒకటికి రెండు సార్లు బిగ్‌బాస్, హోస్ట్ నాగార్జున హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో ప్రేక్షకులు సైతం అసహనం వ్యక్తం చేశారు. తక్కువ ఓటింగ్ పర్సంటేజీ రావడంతో గ్రాండ్ ఫినాలేకు ముందు గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఆమెకు మరికొన్ని షోలు, ప్రోగ్రామ్స్‌లో అవకాశం దక్కింది. బిగ్‌బాస్ తెలుగు 7కి బజ్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని తనదైనశైలిలో క్వశ్చన్స్ అడిగి రక్తి కట్టించింది.

bigg boss fame geethu royal baby boy oreo cat death video

తాజాగా గీతూ రాయల్ లైఫ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె కొడుకు ఓరియో చనిపోయాడు. అదేంటీ గీతూకి పెళ్లై నాలుగేళ్లు కావొస్తున్నా, ఆమెకింకా పిల్లలు లేరు. అలాంటిది మధ్యలో కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని జనం కంగారు పడిపోతున్నారు. నిజానికి ఓరియో అంటే పిల్లి.. దానిని బిడ్డలాగే సాకుతూ, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది గీతూ. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ హౌస్‌లోనే చెప్పింది.. ఇంటి దగ్గరి నుంచి మీకేం కావాలో చెప్పాలని నాగ్ అడగ్గా తన ఓరియో బొచ్చె కావాలంటూ గీతూ చెప్పిన మాటకు అంతా షాకయ్యారు.

ఓరియోను కంటికి రెప్పలా, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఓరియోను వీధి కుక్కలు కరిచి చంపేశాయి. దీంతో దానికి స్నానం చేయించి ఖననం చేస్తూ గుండెలవిసేలా రోదించింది గీతూ. ఓరియో బంగారం.. నా బిడ్డ లేదు.. ఐ లవ్ యూ అంటూ దానితో సంతోషంగా ఉన్న రోజులను గుర్తుచేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 2021 డిసెంబర్ 13న ఓరియో మా ఇంట్లో అడుగుపెట్టిందని.. దీనికి కనీసం ఎలా అరవాలో, కరవాలో కూడా తెలియదని చెప్పింది.

రోజూలాగే జూలై 27న ఉదయం 3.45 గంటలకు బయటకు వెళ్లింది. 5.30 గంటల కల్లా ఇంటికి తిరిగొచ్చేది.. కానీ ఆ రోజు రాలేదు.. సాయంత్రం వరకు వెతుకుతూనే ఉన్నామని, చివరికి అది మా కమ్యూనిటీ వెనుక చనిపోయి కనిపించింది. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం వల్ల కొన్ని వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలకు వచ్చాయని.. తన బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి. ఆ సమయంలో వాడు ఎంత భయపడిపోయిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఓరియో పడ్డ వేదనను తలచుకుంటేనే కష్టంగా ఉంది. దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నా.. ఓరియో నాన్న, కుదిరితే తిరిగొచ్చేయ్ బంగారు కొండ, మమ్మా నిన్ను ఎంతో ప్రేమిస్తోంది అంటూ గీతూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: bigg boss geethu royal oreo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X