‘టాబ్లెట్ మింగితేనే బతుకు... ఆమెతో పెట్టుకున్నందుకు నా జీవితానికి అలాంటి శిక్ష’

కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీవారు కొలువైయున్న తిరుమల క్షేత్రం ఇటీవల పలువురి కారణంగా వివాదాల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఆలయం ముందే ఫోటో షూట్‌లు, వీడియోలు తీయడం, రాజకీయ విమర్శలు వంటి వాటితో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తీన్మార్ సావిత్రి తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై టీటీడీ సీరియస్ అవ్వడంతో శివజ్యోతి క్షమాపణలు చెప్పింది.

రెండ్రోజుల క్రితం యంగ్ హీరోయిన్ శివానీ నాగారం తిరుమల దర్శనంపై చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. తాను శ్రీవారిని దాదాపు 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నానని.. శ్రీవాణి టికెట్ ద్వారా గర్భగుడి వరకు వెళ్లి స్వామి వారిని అతి సమీపం నుంచి చూసే అవకాశం దక్కిందని పేర్కొంది. అయితే అంతసేపు గర్బగుడిలో ఎలా ఉన్నారు? మీరు హీరోయిన్ కాబట్టి వీఐపీ ట్రీట్‌మెంచ్ ఇచ్చారా? అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీనికి శివానీ నాగారం క్లారిటీ ఇచ్చారు. తాను క్యూలైన్ నుంచి గర్భగుడి వరకు వెళ్లిన సమయం మొత్తాన్ని చెప్పాను తప్పించి.. గర్భగుడిలోనే 15 నిమిషాల పాటు ఉండలేదని వివరణ ఇచ్చింది.

Bigg Boss Fame Geetu Royal Faces Controversy Over Tirumala Reels Issues Emotional Apology

తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, నటి గీతూ రాయల్ తాజాగా తిరుమలలో చేసిన ఓ పనితో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తన మిత్రులతో కలిసి శ్రీవారి ఆలయానికి వెళ్లిన ఆమె.. శ్రీవారి సన్నిధిలో, పుష్కరిణి వద్ద, ఘాట్ రోడ్‌లోని పలు ప్రాంతాల్లో కొన్ని రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తిరుమలలోని నిషేధిత ప్రాంతాల్లో ఇలాంటివి చేయడంతో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. దాంతో విషయం టీటీడీ దాకా వెళ్లడంతో గీతూ రాయల్‌పై యాక్షన్‌కు సిద్దమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై గీతూ రాయల్ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టారు. అందరికీ గుడ్‌న్యూస్ నా మీద చర్యలు తీసుకుంటారట, హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్దది చేసి అన్ని వీడియోలు చేసినదానికి థ్యాంక్స్. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. ఇంక పోయేదానికి కూడా ఏం లేదు. ఇంక కొద్దో గొప్పో మిగిలి ఉంది. దానిని మీరు పొగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి. హ్యాపీగా బతికేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతకుముందు మరో వీడియోలో గీతూ రాయల్ స్పందిస్తూ.. మనుషులు అన్నాక తప్పు చేస్తారు. తప్పులు అనేవి మనుషులే చేస్తారు. తప్పు చేశాను అని ఒప్పుకోవడం గొప్ప.. దానిని రియలైజ్ కావడం గొప్ప. దానిని మళ్లీ రిపీట్ చేయకపోవడం అంత కంటే గొప్ప. నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను.. 2024లో విజయవాడలో ఓ రోడ్‌‌లో పోతుంటే కొన్ని వేలమంది భవానీ భక్తులు రోడ్ బ్లాక్ చేశారు. దాంతో వీళ్లకి పనిపాటా లేదా? అనేశా. కారులో ఉన్నవాళ్లంతా చెప్పారు. కనకదుర్గమ్మ చాలా పవర్‌ఫుల్ అన్నారు. అప్పట్లో నాకంత దైవభక్తి లేదు.. బొక్కలే అనుకున్నా. కట్ చేస్తే ఎక్కువ టైం కూడా పట్టలేదు. నాలుగే రోజుల్లో నా జీవితం తలకిందులైంది. అమ్మవారు తన పవర్ చూపించింది. నన్ను అంటావా? నా భక్తుల్ని అంటావా అని కోప్పడింది. ఆరు నెలలు టాబ్లెట్ లేకుండా నా బాడీ కదల్లేనంత పరిస్థితుల్లో ఉన్నా. అప్పుడు రియలైజ్ అయ్యా. దేవుడెంత పవర్‌ఫుల్లో.. ఎక్కువ తక్కువ చేస్తే జీవితాన్ని తలకిందులు చేసేస్తాడు. అప్పటి నుంచి నా బాడీలో సనాతన ధర్మాన్ని ఎక్కించేసుకున్నా. నాటి నుంచి దేవుడి దగ్గర వేషాలు వేయలేదు అని గీతూ రాయల్ తెలిపారు.

రెండ్రోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేశాం. తిరుమలకు వెళ్లినప్పుడు మా ఫ్రెండ్ ఒకరికి దర్శనం టికెట్ కన్ఫర్మ్ కాలేదు వెయిట్ చేయాల్సి రావడంతో సెక్యూరిటీ చెకింగ్ దాటేసిన తర్వాత లెఫ్ట్‌లో ఆగాం. వెంకటేశ్వర స్వామి నుదిటి రాతను మారుస్తాడు, కోరికలన్నీ తీరుస్తాడన్న పాయింట్‌లో దాని మీదున్న గోవింద గోవింద సాంగ్‌‌ని మా కోరికలన్నీ ఆ సాంగ్ రూపంలో ఒక రీల్ చేశాం. ఆ రీల్ పోస్ట్ చేసిన తర్వాత నా మీద చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో నేను ఆ వీడియోని డిలీట్ చేసేశా. మీ కామెంట్స్‌కి భయపడి కాదు.. కర్మకి భయపడి. నన్ను చాలా మంది ఫాలో అవుతుంటారు. నేను చేశానని చిన్నపిల్లలు అలా చేసి వాళ్లకి ఏదైనా జరిగితే జన్మలో నన్ను నేను క్షమించుకోలేను. అందుకే డిలీట్ చేశా. అంతే తప్పించి రీల్ చేసినంత మాత్రాన దేవుడి మీద భక్తి లేదు, ఇష్టం లేదు అని అస్సలు అనుకోవద్దు. దేవుడు అనుకుంటే భస్మం చేసేస్తాడు లైఫ్‌ని. నా వీడియో వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి. ఇలాంటిది మళ్లీ జీవితంలో రిపీట్ చేయను అని గీతూ రాయల్ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: bigg boss geetu royal tirumala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X