బిగ్ బాస్ హమీదా ఓవర్ డోస్ బోల్డు షో: ఎద అందాలను ఆరబోస్తూ ఘాటుగా!

తెలుగు బుల్లితెర అలాగే వెండితెరపైన ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో చాలా మంది సరైన అవకాశాలను సొంతం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో బెంగాలీ చిన్నది హమీదా ఖతూన్ ఒకరు. చాలా రోజుల క్రితమే టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ బ్యూటీ.. కొన్ని సినిమాలు చేసినా పాపులర్ కాలేదు. బిగ్ బాస్ షో ద్వారానే పాపులర్ అయింది. దీంతో ఇప్పుడు అరకొర అవకాశాలను అందుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

 అలా పరిచయం.. గుర్తింపు రాలే

అలా పరిచయం.. గుర్తింపు రాలే

బెంగాల్‌లో మోడల్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న హమీదా ఖతూన్ ‘సాహసం చేయరా డింభకా' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్' అనే సినిమాలోనూ నటించింది. కానీ, ఆమెకు కావాల్సిన గుర్తింపు కానీ, సక్సెస్ కానీ లభించలేదు. దీంతో హమీదాకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఫలితంగా ఈ బ్యూటీ కెరీర్ మసకబారిపోయింది.

బిగ్ బాస్ ఆఫర్... లవ్ ట్రాకుతో

బిగ్ బాస్ ఆఫర్... లవ్ ట్రాకుతో


బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హమీదా ఖతూన్ కూడా ఉంది. పెద్దగా తెలుగు వాళ్లకు పరిచయం లేని ఈ భామ.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే, స్మోకింగ్, హాట్ షో, శ్రీరామ చంద్రతో ట్రాక్‌తో హమీదా ఫుల్ ఫేమస్ అయింది. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా పెంచేసుకుంది.

నాన్ స్టాప్‌ ఛాన్స్.. మళ్లీ అవుట్

నాన్ స్టాప్‌ ఛాన్స్.. మళ్లీ అవుట్


ఐదో సీజన్‌లో ఆకట్టుకోలేక ఏడవ వారమే వచ్చేసిన హమీదా ఖతూన్‌కు.. గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో అవకాశం దక్కింది. అయితే, ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా ఆరంభంలోనే కాకుండా ఆరు వారాల పాటు అందులో కొనసాగింది. కానీ, ఊహించని విధంగా మరోసారి మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిపోయింది.

బ్రహ్మముడితో సరికొత్త రూట్

బ్రహ్మముడితో సరికొత్త రూట్


బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హమీదాకు ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ మాలో కొత్తగా ప్రారంభం అయిన ‘బ్రహ్మముడి' అనే సీరియల్‌లో ఆమె కీలక పాత్రను పోషించే ఛాన్స్ పట్టేసింది. ఇందులో మెప్పిస్తే ఆమె సీరియల్ నటిగా మరింత హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ


బోల్డు బ్యూటీ హమీదా ఖతూన్ ఫేమస్ అవడానికి బిగ్ బాస్ కారణమైతే.. ఆమెకు ఫాలోయింగ్ పెరగడానికి మాత్రం సోషల్ మీడియానే రీజన్ అని చెప్పొచ్చు. అందుకే ఇందులో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ.. ఫొటోలు, వీడియోలూ షేర్ చేస్తోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న హమీదా

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న హమీదా


ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హమీదా ఖతూన్ తెగ సందడి చేసేస్తోంది. ఆమె షేర్ చేస్తోన్న ఫొటోల్లో ఎక్కువగా అందాల విందు చేస్తూ దిగినవే ఎక్కువగా ఉంటోన్నాయి. ఇక, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.

హాట్ ఫొటోలను వదిలిన నటి

హాట్ ఫొటోలను వదిలిన నటి


హమీదా ఖతూన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా కారులో ఘాటుగా ఫోజులిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. దీంతో ఆమె ఎద, తొడ అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ బిగ్ బాస్ భామ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కడంతో ఇవి వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X