బిగ్‌బాస్ హరితేజకు వేధింపులు.. ప్రేమిస్తున్నా అంటూ

బిగ్‌బాస్ ద్వారా పాపులరై సినిమాలు, సీరియల్స్‌లో అవకాశం దక్కించుకుని స్టార్స్‌గా మారుతున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో హరితేజ కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాల నుంచి బుల్లితెర, వెండితెరపై సక్సెస్ అయిన అతికొద్దిమందిలో ఆమె ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియలో తొలి నుంచి యాక్టీవ్‌గా ఉండే హరితేజ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తిరుపతికి చెందిన హరితేజ మరాఠీ తండ్రికి, కన్నడ తల్లికి జన్మించారు. చిన్నతనంలోనే కూచిపూడి , సంగీతం, గానంలో శిక్షణ పొందిన ఆమె అనంతరం కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత తెలుగు టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన హరితేజ తొలుత చిన్నారి అనే సీరియల్‌లో నటించారు. తర్వాత రక్త సంబంధం, కన్యాదానం, మనసు మమత, అభిషేకం, తాళికట్టు శుభవేళ, శివరంజని వంటి సీరియల్స్‌లో నటించి తెలుగు లోగిళ్లకు బాగా దగ్గరయ్యారు.

Bigg Boss Fame Hari Teja shares her latest photo shoot with blue saree

ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ సీజన్ 1లో అవకాశం దక్కించుకుని హౌస్‌లో అలరించారు. ఆ తర్వాత యాంకరింగ్‌లో దిగిన హరితేజ.. అభిరుచి, పండగ చేస్కో, సూపర్ సింగర్, ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో వంటి షోలకు హోస్ట్‌గా అలరించారు. బుల్లితెరతో పాటు ఎన్నో సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో ఆకట్టుకున్నారు. బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న హరితేజకు సినిమాల్లోనూ అవకాశాలు వరించాయి.

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, గ్రామంలో వినాయకుడు, అందరి బంధువయ, అనగనగా ఓ ధీరుడు, దమ్ము, అత్తారింటికి దారేది, దిక్కులు చూడకు రామయ్య, వన్ నేనొక్కడినే, అ ఆ, దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, కృష్ణార్జున యుద్ధం, ఎఫ్ 2, దేవర, భోళా శంకర్, హిట్ 1, రాజుగారి గది తదితర సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. గతేడాది జరిగిన బిగ్‌బాస్ తెలుగు 8లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకున్నారు హరితేజ. వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ మధ్యలో అడుగుపెట్టిన ఆమె బిగ్‌బాస్ 1 మాదిరిగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు.

బుల్లితెర నటిగా, యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న హరితేజ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటున్నారు. దీనిలో భాగంగా తన సినిమాలు, సీరియల్స్, ఈవెంట్స్‌, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. అంతేకాదు.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ సెగలు రేపుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నీలిరంగు చీర కట్టుకుని అందాలతో కవ్వించింది హరితేజ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె.. ఏమంటున్నా వదలడు, తెగ ప్రేమించాక వదలడు అంటూ సీతాకోక చిలుక, లవ్ సింబల్, చేప ఎమోజీలను పంచుకుంది. మరి ఇంకేందుకు ఆలస్యం హరితేజ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: bigg boss hari teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X