ఈ జన్మలో బిగ్‌బాస్ షోకు వెళ్ళను.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్

బుల్లితెరపై అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) ఒకటి. ఈ షో గురించి ఎంత విమర్శలు వచ్చినా, ఎంత వివాదాలు చుట్టుముట్టినా దాని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి సీజన్‌లో కొత్త కంటెస్టెంట్స్, కొత్త టాస్కులు, కొత్త గొడవలు కానీ అదే ఉత్కంఠ, అదే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ షో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇలాంటి రియాలిటీ షోపై ఓ స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు?

ఈ బిగ్ బాస్ ఫేమ్ ఎవరో కాదు.. రెండు సార్లు హౌస్‌లో అడుగుపెట్టిన నటి, యాంకర్ హరితేజ(Hari Teja). ఆమె గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. హరితేజ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన బిగ్ బాస్ తెలుగు అనుభవాలను ఓపెన్‌గా షేర్ చేసింది. ముఖ్యంగా "ఇక జీవితంలో మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లను" అన్న ఒక్క మాటే నెట్టింట హాట్ టాపిక్ అయింది. గతంలో సీజన్ 1లో పాల్గొన్నప్పుడు తనకు ఎంతో ఎంజాయ్‌మెంట్ కలిగిందని, కానీ సీజన్ 8 అనుభవం పూర్తిగా భిన్నంగా ఉందని వెల్లడించింది.

Bigg Boss Fame Hari Teja Shocking Throwback Comments Go Viral Again

హరితేజ చెప్పిన ఆసక్తికర విషయాల్లో ఒకటి మొదటి సీజన్ షూటింగ్ గురించి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్ 1 ముంబై సమీపంలోని లోనావాలాలో అడవి ప్రాంతంలో షూట్ అయ్యిందని ఆమె గుర్తుచేసింది. 'రాత్రి వేళల్లో పులుల శబ్దాలు వినిపించేవి... పాములు కూడా హౌస్‌లోకి వచ్చేవి. అయినా ఆ టైమ్‌లో మేమంతా చాలా ఎంజాయ్ చేశాం' అని చెప్పింది. ఆ అనుభవాలు భయంకరంగా ఉన్నా, అదే సమయంలో థ్రిల్లింగ్‌గా అనిపించాయని ఆమె పేర్కొంది.

ఇక సీజన్ 1లో జూనియర్ ఎన్టీఆర్ తో తన సరదా సంభాషణలను కూడా హరితేజ గుర్తు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన చిన్న చిన్న ఫన్నీ గొడవలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే అంశాలే. ఆ బాండింగ్ కూడా తనకు ఆ సీజన్‌ను స్పెషల్‌గా మార్చిందని చెప్పింది. అయితే అదే హరితేజ, బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్న తర్వాత పూర్తిగా తన అభిప్రాయం మార్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గేమ్ లోకి అడుగుపెట్టింది.

ఈ సీజన్ గురించి మాట్లాడుతూ.. 'ఆ సీజన్ తర్వాత నా ఇమేజ్ చాలా దెబ్బతింది. బయట చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటి వల్ల నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను" అని భావోద్వేగంగా చెప్పింది. ఆ అనుభవం తనను మానసికంగా బాగా ప్రభావితం చేసిందని, తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని వెల్లడించింది. "అందుకే ఇక మళ్లీ బిగ్ బాస్‌కు వెళ్లాలనే ఆలోచనే లేదు" అని స్పష్టం చేసింది.

హరితేజ ఇంకా మాట్లాడుతూ..ఆమె ఇప్పుడు ఈ షో చూడడానికే ఆసక్తి చూపించడం లేదు. "రెండు సార్లు వెళ్లిన తర్వాత బిగ్ బాస్‌పై ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది... కొన్నిసార్లు చిరాగ్గా కూడా అనిపిస్తుంది. ఆఫర్ వస్తే.. అందరూ తూర్పుకు మొక్కుతే.. నేను అన్ని దిక్కుల మొక్కుతా.. ఈ జన్మలో బిగ్‌బాస్ షోకు వెళ్ళను" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. హరితేజ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X