అందాల డోస్ పెంచేసిన బిగ్‌బాస్ హరితేజ.. ఈవెంట్‌లో కెమెరాలన్నీ అటే!
సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరితేజ. ఇక బిగ్‌బాస్‌లో బుర్రకథతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. స్టైల్, ఫ్యాషన్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే హరితేజ .. ట్రెండీ వేర్‌తో పాటు చీరలోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియలో తొలి నుంచి యాక్టీవ్‌గా ఉండే హరితేజ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి పాదాల చెంత వున్న తిరుపతి నగరానికి చెందిన వారు హరితేజ. ఈమె తండ్రి మరాఠీ అయితే, తల్లి కన్నడిగ. తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో హరితేజ అనర్గళంగా మాట్లాడతారు. కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తొలుత చిన్నారి అనే ధారావాహికలో నటించారు. అనంతరం రక్త సంబంధం, కన్యాదానం, మనసు మమత, అభిషేకం, తాళికట్టు శుభవేళ, శివరంజని వంటి సీరియల్స్‌తో అలరించారు.

హిందీలో పాపులర్ అయిన బిగ్‌బాస్‌ను తెలుగులో ప్రారంభించి స్టార్ మా. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో కంటెస్టెంట్‌గా హరితేజకు అవకాశం దక్కింది. తన చలాకీతనం , అందంతో హరితేజ బాగా అలరించారు. అన్నింటికి మించి బుర్రకథతో ఆమె ఇంకా ఫేమస్ అయ్యారు. తర్వాత యాంకర్‌గా మారిన హరితేజ.. అభిరుచి, పండగ చేస్కో, సూపర్ సింగర్, ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో వంటి షోలకు హోస్ట్‌గా చేశారు.
బుల్లితెర మీద పాపులర్ కావడంతో వెండితెర నుంచి హరితేజకు ఆఫర్లు వెల్లువెత్తాయి. పలువురు స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషించారు. ఈ దశలో బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి అడుగుపెట్టే అవకాశం ఆమెకు దక్కింది. గతేడాది ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే హరితేజలో మునుపటి జోష్ కనిపించలేదని, బిగ్‌బాస్ 1 మాదిరిగా పర్ఫార్మెన్స్ లేదంటూ ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేశారు. ఇక బుల్లితెర, వెండితెరతో పాటు ఎన్నో సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నారు హరితేజ.
ఖాళీ సమయాల్లో భర్త, కూతురు, కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటున్నారు. దీనిలో భాగంగా తన సినిమాలు, సీరియల్స్, ఈవెంట్స్, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. అంతేకాదు.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. తాజాగా నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమా ఈవెంట్‌కు హోస్టింగ్ చేసిన హరితేజ తన అందాలతో కవ్వించింది హరితేజ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. మరి ఇంకేందుకు ఆలస్యం హరితేజ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications










