అమ్మ బాబోయ్ ఐటెం సాంగ్‌తో దుమ్ములేపింది.. హారిక హాట్ స్టెప్పులు వైరల్
ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ల హవా నడుస్తోందన్న సంగతి తెలిసిందే. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ షో అయ్యాక కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. బిగ్ బాస్ షో అయ్యాక.. మిగతా ఈవెంట్లు, షోలతో కంటెస్టెంట్లు ఫుల్ బిజీగా ఉన్నారు. కొందరు బుల్లితెర షోలతో బిజీగా ఉంటే.. ఇంకొందరు మాత్రం వెండితెరపై అవకాశాలు రావడంతో అక్కడికి చెక్కేశారు. అలా అందరూ బిజీగా ఉన్నారు. తాజాగా హారిక మాత్రం డ్యాన్స్ ప్లస్ షోలో అదిరిపోయే పర్ఫామెన్స్ చేసింది.

స్పెషల్ వీకెండ్..
బిగ్ బాస్ షో అనంతరం ఓంకార్ ఎంతో గ్రాండ్‌గా డ్యాన్స్ ప్లస్ షోను ప్రారంభించాడు. మోనాల్, ముమైత్ ఖాన్, యానీ, యశ్, రఘు మాస్టర్ వంటివారిని పట్టుకొచ్చాడు. కొసమెరుపుగా బాబా భాస్కర్ వంటి ఎంటర్టైనర్‌గా తీసుకొచ్చారు. కానీ రేటింగ్ మాత్రం రావడం లేదు.అందుకే ఈ వీకెండ్‌ను కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు.

సెలెబ్రిటీలతో డ్యాన్స్..
ఏం చేసినా కూడా టీఆర్పీ రావడం లేదని ఈ వీకెండ్‌ను సెలెబ్రిటీలను దింపాడు. ఇది వరకు ఉన్న కంటెస్టెంట్లతోనూ కొత్తగా సెలెబ్రిటీలను కలిపి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చేలా చేశాడు. అందులో భాగంగానే విష్ణుప్రియ, కార్తీకదీపం ఫేమ్ హిమను పట్టుకొచ్చాడు.

ఇప్పుడు ఇలా..
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరు అంటే.. అందరూ కూడా మెహబూబ్, హారికల పేర్లు చెబుతుంటారు. ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులు వేస్తే మోత మోగిపోవాల్సింది. అందుకే ఈ ఇద్దరినీ కూడా పట్టుకొచ్చాడు. డ్యాన్స్‌లు వేయించాడు. అయితే ఇద్దరినీ ఒకే జట్టులో కాకుండా వేర్వేరుగా వేయించాడు.
Recommended Video

ఐటెం సాంగ్‌తో రచ్చ..
హారిక ఎంత మంచి డ్యాన్సరో బిగ్ బాస్ వీక్షకులకు తెలుస్తుంది. ఆమె ఎక్కువగా ఫేమస్ అయింది కూడా ఆ క్యాటగిరీలోనే. ఎక్స్పోజింగ్, డ్యాన్స్ ఇలా అన్నింల్లో హారిక స్పెషల్. అందుకే డ్యాన్స్ ప్లస్ షోలోనూ తనదైన శైలిలో ఐటెం సాంగ్‌కు చికినీ చమేలి అంటూ కత్రినా స్టైల్లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఎలాగూ బిగ్ బాస్ ఇంట్లో ఐటెం రాణిగా అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











