'అల్లు అర్జున్ అంటే పిచ్చి.. ఆయన కోసం 15 రోజులు అన్నం మానేశా..'

టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఇప్పుడు బన్నీ పేరు అంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా అభిమానంతో మాట్లాడే స్థాయికి చేరుకుంది. అలాంటి స్టార్‌తో ఒక్కసారి కలవడం, కలిసి పనిచేయడం చాలా మందికి కలలాంటిది.

అయితే తాజాగా ఒక నటి అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానం గురించి చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే... బన్నీపై ఉన్న క్రేజ్ కారణంగా ఏకంగా 15 రోజుల పాటు తిండి కూడా మానేసిందట.ఈ విషయం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరు? ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకుంది?

Bigg Boss Fame HariTeja Opens Up About 15-Day Liquid Diet for Allu Arjun Film

ఆ నటి ఎవరో కాదు... టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హరితేజ (HariTeja). యాంకర్‌గా, సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మనసు మమత, రక్తసంబంధం, కన్యాదానం వంటి సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ, తరువాత సినిమాల్లో కూడా అడుగుపెట్టి తన ప్రతిభను నిరూపించుకుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ' సినిమాలో చేసిన పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అదనంగా 'బిగ్ బాస్' షో ద్వారా ఆమె పాపులారిటీ మరింత పెరిగింది.

ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం (డీజే)' సినిమాలో అవకాశం రావడం హరితేజ కెరీర్‌లో ఒక మైలురాయిగా మారింది. అయితే ఆ అవకాశం కోసం ఆమె చేసిన కష్టం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హరితేజ చెప్పిన వివరాల ప్రకారం.. బన్నీ పక్కన స్లిమ్‌గా కనిపించాలనే ఉద్దేశంతో వరుసగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకుందని తెలిపారు. సాధారణ ఆహారాన్ని పూర్తిగా మానేసి, కఠినమైన డైట్ ఫాలో కావడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు.

అంతేకాదు, షూటింగ్‌కు ముందు రోజు ఉత్సాహంతో నిద్రపట్టకపోవడం, మరుసటి రోజు సెట్లో అల్లు అర్జున్‌ను కలవడం తన జీవితంలో మరచిపోలేని క్షణమని హరితేజ భావోద్వేగంగా చెప్పారు. ముఖ్యంగా బన్నీ స్వయంగా తన దగ్గరకు వచ్చి "బిగ్ బాస్‌లో నీ పెర్ఫార్మెన్స్ చూశాను... చాలా బాగా చేశావు" అని చెప్పడం తనకు జీవితాంతం గుర్తుండే సంఘటనగా పేర్కొన్నారు. ఒక స్టార్ హీరో తన పనిని గుర్తించి అభినందించడం తనకు అంతులేని ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.

ఇదిలా ఉంటే, 'పుష్ప' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హరితేజ హోస్ట్ చేసిన సందర్భంలో కూడా అల్లు అర్జున్ ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించడం అప్పట్లో వైరల్ అయ్యింది. తెలుగు అమ్మాయిగా, మంచి ఆర్టిస్ట్‌గా ఆమెపై తనకున్న అభిమానం వ్యక్తం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఘటన స్టార్ హీరోల ప్రభావం కేవలం అభిమానులకే కాకుండా, ఇండస్ట్రీలోని ఇతర నటీనటులపై కూడా ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. అదే సమయంలో, ఒక చిన్న అవకాశం కోసం ఎంతటి కష్టం పడాల్సి వస్తుందో కూడా హరితేజ ఉదాహరణ చూపిస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు వీడియో మరోసారి నెట్టింట్లో తెగవైరలవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X