Bigg Boss Swetha Varma: లక్ష ఇస్తాం.. కానీ డైరెక్టర్ తో కమిట్మెంట్.. కాస్టింగ్ కౌస్ట్ పై బిగ్ బాస్ ఫేమ్ షాకిం
Bigg Boss Swetha Varma: సినీ ఇండస్ట్రీలో నటీమణులపై జరుగుతున్న దారుణాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రెటీలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందుకు వచ్చి దైర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలపై బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌస్ట్ అనేది ఉంది. ఇప్పటికి కూడా కొనసాగుతోంది. కానీ, అప్పటికి ఇప్పటి చాలా తేడా వచ్చింది. ప్రస్తుతం సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. చాలా మందికి అవెర్నెస్ వచ్చింది. మహిళలు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడటం. మీటూ మూమెంట్, మహిళలకు సపోర్టుగా మగవాళ్లు నిలవడం ఇలా చాలా చేంజ్ రావడంతో 99 శాతం నుంచి 30 శాతానికి పడిపోయింది. 'అన్నారు.

కమిట్మెంట్ గురించి మాట్లాడుతూ..'యూట్యూబ్ లో షార్ట్ ఫీల్మీస్, వీడియోలు, ఇస్టాగ్రామ్ లో రీల్స్ , ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టేరోజుల్లో కమిట్మెంట్ అంటే.. అసలు తెలియదు. నేను కష్టపడి పనిచేయడం అని భావించే దాన్ని. ఓ సారి ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో మీరు ఇలా కమిట్మెంట్ అంటే.. నాకు అర్థం కాక.. ఏంటీ మెసేజ్ పెట్టా.. వాళ్లు డైరెక్టర్ తో అలా... అలా .. మెసేజ్ పెట్టారు. ఇది 2013లో జరిగింది. నేను వాటిన్నింటిని స్క్రీన్ షాట్ చేసి.. మరుక్షణంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసా.. ఇప్పటికీ ఆ పోస్టులు నా ఫేస్ బుక్ లో ఉన్నాయి' అని సంచలన వాస్తవాలు వెల్లడించింది.
'ఆ తరువాత కొన్ని రోజులకు ఓ ఆఫర్ వచ్చింది. అది మూవీ కాదు. యాడ్ ఫీల్మ్ లో.. లక్ష రూపాయాలు ఇస్తామన్నారు. కానీ, ఆ డైరెక్టర్ యాంట్స్ టు డూ.. అలా.. అలా.. అన్నారు. తాను వెంటనే ఐ వాట్ టూ ఆస్క్ సంథింగ్ అని నేను కూడా అడిగాను. వాళ్లు ఏంటీ అన్ని ప్రశ్నించగా.. మరీ డైరెక్టర్ బిల్డింగ్ దూకుతారా? అని ప్రశ్నించా.. నాకు కోపం చాలా ఎక్కువ. ఏది ఉన్నా ముక్కుసూటిగా చెప్పేస్తా..'అని షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ శ్వేతవర్మ.

తన కెరీర్ ప్రారంభంలో అటు సినిమాల్లో గానీ, ఇటు యాడ్స్ లో గాని ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వారిని ఎప్పుడూ నేరుగా కలువలేదు. ఏ ఆఫర్ వచ్చినా.. ఆన్ లైంలోనే డీల్ జరిగేది. డైరెక్ట్ గా నేను ఎప్పుడూ కూడా ఇలాంటి అనుభావాలను ఎదుర్కొలేదు. ఇప్పుడూ కాస్త వేధింపులు తగ్గాయి లేండీ అని సంచలన విషయాలను వెల్లడించింది హీరోయిన్ శ్వేతవర్మ.
ఇక నటి శ్వేత వర్మ కెరీర్ విషయానికి వస్తే.. ఈ అమ్మడు రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, రోజ్ విల్లా వంటి చిత్రాల్లో కనిపించింది. ఆ మూవీస్ లో కేవలం సహయనటిగా నటించింది. కానీ, ఆమె పాత్రలకు సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షో ద్వారా మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. అయినా ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదనిపిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్వేత వర్మ తన సీని, పర్సనల్ కెరీర్ విషయాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.


Click it and Unblock the Notifications











