బెడ్రూమ్‌లో సీక్రెట్‌గా రవికృష్ణ స్టెప్పులు.. హిమజ ఇంట్లో హంగామా.. బిగ్‌బాస్ గ్యాంగ్ రచ్చ
బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ గురించి, పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మూడు సీజన్స్ సక్సెస్ అయినా కానీ చివరి దాంట్లో పాల్గొన్న కంటెస్టెంట్లకు వచ్చినంత క్రేజ్ మరెవరకీ రాలేదు. మూడో సీజన్ హౌస్‌మేట్స్ అందరికీ దాదాపు అంతకు ముందున్న దానికంటే రెట్టింపు గుర్తింపు వచ్చింది. హౌస్ లోపల ఎన్ని గొడవలు పెట్టుకున్నా గానీ బయటకు వచ్చాక అందరూ కలిసి మెలిసే ఉంటున్నారు. అదే మూడో సీజన్ కంటెస్టెంట్ల ప్రత్యేకత.

పార్టీలతో హల్చల్..
బిగ్‌బాస్ మూడో సీజన్ ముగిసినా గానీ కంటెస్టెంట్ల రచ్చ మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక పార్టీ జరగడం, అందరూ ఒకే చోటకు రావడంతో సందడిగా మారుతుంది. అయితే వీరిలో వితికా, రాహుల్, వరుణ్, హిమజ, శివజ్యోతి, అషూ, రవికృష్ణ, అలీ రెజా, రోహిణి మాత్రం ఎప్పటికీ కలుస్తుంటారు.

స్సెషల్ గ్యాంగ్..
శివజ్యోతి, రవికృష్ణ, హిమజల గ్యాంగ్ మాత్రం మరింత ప్రత్యేకం. ఒకే చోట ఇళ్లు ఉండటంతో నిత్యం ఒక దగ్గరే ఉంటారు. ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తారు. ఫోటోషూట్లు, టిక్ టాక్ వీడియోలు చేస్తూ రచ్చ చేస్తుంటారు.

హిమజ ఇంట్లో వేడుక..
హిమజ తండ్రి పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి బిగ్ బాస్ హౌస్‌మేట్స్ రవికృష్ణ, శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డి, రోహిణి వచ్చారు. వీరి రాకతో పార్టీ అంతా సందడిగా మారింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

సీక్రెట్ డ్యాన్స్..
బర్త్ డే పార్టీలో రవికృష్ణ మాత్రం సీక్రెట్‌గా డ్యాన్సులు వేస్తున్నాడు. బెడ్రూమ్‌లో వేస్తున్న రవికృష్ణ స్టెప్పులను శివజ్యోతి ఫోన్‌లో బంధించింది. మధ్యలో రోహిణి వచ్చి కాలు కదిపింది. ఇలా మొత్తంగా బర్త్ డే పార్టీని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతో పొంగిపోయిన హిమజ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











