షర్ట్ అలా ప్యాంట్ మొత్తం ఇలా.. వామ్మో బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్
బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన హిమజ.. ఫుల్ హల్చల్ చేస్తోంది. హౌస్‌లో ఉన్నంత వరకు సందడి చేసిన హిమజ.. బయటకు వచ్చాక మరింత పెంచింది. బిగ్‌బాస్ షోతో హిమజకు అంతకు ముందున్న దానికంటే వంద రెట్ల ఫాలోయింగ్ పెరిగింది.. క్రేజ్ వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో అలీతో గొడవ వ్యవహారం ఆమెను లైమ్ లైట్‌లోకి తెచ్చింది. టాస్క్‌లో యాక్టీవ్‌గా పార్టిసిపేట్ చేయడం, అప్పుడప్పుడు ఆమె పెట్టుకునే గొడవలు ఇలా అన్నీ ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.

పాపులర్ చేసిన ట్రైన్ టాస్క్..
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో చేసిన టాస్క్‌లో ట్రెయిన్ టాస్క్ కాసింత ఎంటర్టైనింగ్ ఉంటుంది. అందులో హిమజ-మహేష్ విట్టాలు భార్యభర్తలుగా చేయడం, వనజ-లింగం జంటగా వారిద్దరూ బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంది. రాహుల్‌తో మనోహరా.. పాటకు హిమజ వేసిన స్టెప్పులు, వారిద్దరి కెమిస్ట్రీ హౌస్‌లో వేడిని పుట్టించాయి.

పాటతో ఫుల్ ఫేమస్..
హౌస్‌లో ఇచ్చిన ఓ టాస్క్‌లో ఓ సక్కనోడా (గురు సాంగ్) అనే పాట హిమజ పాడటంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. హౌస్‌లో కంటెస్టెంట్లందరూ పగలబడి నవ్వారు. బయటకు వచ్చాక హిమజను ఆ పాటతోనే గుర్తిస్తున్నారంటే అది ఎంతగా రిజిష్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా అందరూ కలిసి..
శివజ్యోతి ఓ ఇంటిని కొనడం, గృహ ప్రవేశం చేయడం అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్‌లో అలీ రెజా, రాహుల్, వరుణ్, వితికా, రవి అందరూ పాల్గొన్నారు. ఇక వీరంతా చేసిన సందడి అంతా ఇంతా కాదని వారు షేర్ చేసిన పిక్స్‌ను చూస్తేనే తెలుస్తోంది.

హాట్ హాట్ ఫోటోలతో కనువిందు..
ఎప్పుడూ నిండుగా దుస్తులు వేసుకుని పద్దతిగా ఉండే హిమజ రూట్ మార్చేసినట్టు కనిపిస్తోంది. స్కర్ట్స్, షార్ట్స్ వేసుకుని అందాల విందు పెడుతోంది. హాట్ హాట్ ఫోటోషూట్లతో నెటిజన్ల మతులు పోగొడుతోంది. తాజాగా హిమజ వేసిన డ్రెస్ అందర్నీ షాక్‌కు గురి చేసింది. షర్ట్ బటన్స్ విప్పేసి.. మొత్తం చిరిగిపోయిన ప్యాంట్‌ను వేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











