'ఇండస్ట్రీలో ఒక్కడికి ఒకే చెబితే.. ప్రతీ ఒక్కడు ఆడుకొంటారు‘

బిగ్ బాస్ ఫ్రేమ్, నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్ ద్వారా నటిగా తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత సినిమాల్లో నటించింది. అనంతరం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొనే అవకాశం కొట్టేసి.. ఆ రియాలిటీ షోతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల నటి హిమజ ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ముఖ్యంగా అవకాశాల పేరుతో జరిగే కమిట్‌మెంట్ వ్యవహారాలు, తాను ఎదుర్కొన్న పరిస్థితులు, కెరీర్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలను గురించి చెప్పింది. ముఖ్యంగా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ కల్చర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

హిమజ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు అవకాశాల పేరుతో సంప్రదిస్తుంటారని చెప్పింది.'ఏమ్మా.. ఈవెనింగ్ వస్తావా?' అని అడిగే సందర్భాలు ఉంటాయని, అయితే అలాంటి ఆహ్వానాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. కొందరు అమాయకంగా అంగీకరిస్తారని, మరికొందరు ఆ విషయం అర్థమై ఇష్టం లేకపోతే నేరుగా రాలేమని చెబుతారని పేర్కొంది. అలాంటి సందర్భాల్లో స్పష్టంగా 'నో' చెప్పితే సాధారణంగా అక్కడితో విషయం ముగిసిపోతుందని హిమజ వెల్లడించింది. 'మీకు ఆసక్తి లేదని చెప్పిన తర్వాత ఎవరూ బలవంతం చేయలేరు. ఎందుకంటే వాళ్లకూ ఒక కుటుంబం, ఒక ఇమేజ్, ఒక సర్కిల్ ఉంటుంది. అనవసర సమస్యలు తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు'అని వివరించింది.

Bigg Boss Fame Himaja Opens Up on Casting Couch Commitments Struggles and Career Choices

అయితే ఎప్పుడైతే అలాంటి విషయాలకు 'ఓకే' చెబుతారో, అప్పటి నుంచి సమస్యలు మొదలవుతాయని హిమజ హెచ్చరించింది. "నువ్వు ఓకే అన్న విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిపోతుంది. ఆ తర్వాత చాలా మంది అదే కోణంలో చూస్తారు. అందుకే మొదటి స్టెప్పులోనే అలాంటి విషయాలను కట్ చేయాలి. లేకపోతే తర్వాత లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కడూ ఆడుకుంటారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక తన కెరీర్‌లో ఎప్పుడైనా తప్పు నిర్ణయాలు తీసుకున్నానని అనిపించిందా? అనే ప్రశ్నకు కూడా హిమజ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "నా వరకు నేను పెద్దగా తప్పు నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవేళ తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదాన్నో కాదో తెలియదు. నేను తీసుకున్న నిర్ణయాలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి" అంటూ స్ట్రైట్‌గా చెప్పేసింది. అలాగే ఎప్పుడైనా ఎవరికైనా సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా? అని ప్రశ్నించగా.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ నిర్మాత శ్రీరామ్ పేరును ప్రస్తావించింది. ఆ సమయంలో తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని, డాక్టర్లు తప్పనిసరిగా సెలైన్ ఎక్కించుకోవాలని సూచించారని తెలిపింది.

"ఆ రోజు షూటింగ్‌కు వెళ్లి నా పరిస్థితి గురించి నిర్మాతకు చెప్పాను. మధ్యాహ్నం వరకు పంపిస్తామని చెప్పారు. కానీ తర్వాత ఎవరూ నా గురించి పట్టించుకోలేదు. సాయంత్రం అయింది, రాత్రి అయింది.. అయినా నా పరిస్థితిని గమనించిన వారు లేరు. మరోవైపు షూటింగ్ పనులతో అందరూ బిజీగా ఉన్నారు. నేను మాత్రం నీరసంగా అక్కడే ఎదురుచూస్తూ ఉన్నాను" అని ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. రెండు సంవత్సరాల పాటు ఆ యూనిట్‌తో కలిసి పనిచేసిన తర్వాత కూడా తన పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం బాధ కలిగించిందని హిమజ తెలిపింది.'ఆ సమయంలో నాకు ఒక్కసారిగా నేను వాళ్లకు అవసరం లేనట్టుగా అనిపించింది. వెంటనే ఆవేశంలో 'సారీ.. నేను వెళ్తున్నా' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాను" అని చెప్పింది.

అయితే అదే నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని హిమజ పేర్కొంది. 'ఆ రోజు ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తర్వాత నాకు సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది. వెనక్కి తిరిగి చూసుకుంటే అది తప్పు నిర్ణయం కాదని ఇప్పుడు అనిపిస్తోంది' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం హిమజ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: bigg boss telugu himaja tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X