‘ఇంటికి పంపకుండా రాత్రి నాపై అలాంటి ప్లాన్... ఆ డైరెక్టర్‌కి అలా బుద్ధి చెప్పా’

బిగ్‌బాస్ ద్వారా తెలుగునాట పాపులర్ అయినవారిలో హిమజ రెడ్డి ఒకరు. అయితే అంతకంటే ముందే సినిమాలు, సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బిగ్‌బాస్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఈ షో తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడంతో పాటు నటిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కష్టపడినట్లుగా హిమజ పలు సందర్భాల్లో ఎమోషనల్ అయ్యారు.

గుంటూరు జిల్లాకు చెందిన హిమజ రెడ్డి తొలుత 2015లో తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టారు. భార్యామణి సీరియల్‌లో నటించిన ఆమె తర్వాత స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం సినీరంగం నుంచి పిలుపురావడంతో శివం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. నేనుశైలజ, చుట్టలబ్బాయ్, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానంభవతి, స్పైడర్, నెక్ట్స్ నువ్వే, వినయ విధేయ రామ, చిత్రలహిరి, వరుడు కావలెను, మాయ పేటిక, దేవర, డాకు మహారాజ్, హరిహర వీరమల్లు తదితర చిల్రాల్లో నటించారు హిమజ రెడ్డి. ఈ దశలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. గేమ్స్, టాస్క్‌లు, వ్యక్తిత్వం పరంగా ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. 9 వారాల పాటు హౌస్‌లో నిలిచారు.

Bigg Boss fame Himaja Reddy Reveals Shocking Reason for Exiting Konchem Ishtam Konchem Kashtam Serial

అయితే బిగ్‌బాస్‌కు ముందు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌ నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకోవడం బుల్లితెర ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. టాప్ టీఆర్పీతో పాటు నటిగానూ హిమజకు మంచి మార్కులు వచ్చిన ఈ సీరియల్‌లో ఆమె లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో హిమజ వెల్లడించారు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ప్రొడ్యూసర్‌కి నేను సారీ చెప్పాలి. ఈ సీరియల్ చేస్తుండగా సడెన్‌గా ఒకరోజున నాకు హెల్త్ బాలేదు. డాక్టర్లు సెలైన్ ఎక్కించాలని చెప్పినా కూడా నేను మొండిగా షూటింగ్‌కు వచ్చేశా. మధ్యాహ్నం వరకు షూటింగ్ చేస్తాను, ఆ తర్వాత నా వల్ల కాదని ముందే చెప్పేశా. సెలైన్ ఎక్కించుకోవాలి కాబట్టి మార్నింగ్ నుంచి అవ్వదు.. కానీ నేను కోపరేట్ చేస్తాను, మధ్యాహ్నం నుంచి ఇంటికి పంపేయండి అని చెప్పానని హిమజ పేర్కొన్నారు.

మధ్యాహ్నం అయిపోవడంతో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా.. అప్పటికీ ఫీవర్‌తో ఉన్నాను, డల్‌గా ఉన్నాను. నాలుగు, ఐదు, ఆరు.. చివరికి రాత్రి 8 గంటలైంది. పంపించే ఉద్దేశం ఉందా? లేదా? అని అడిగా.. అప్పటికే నాకు సహనం చచ్చిపోయింది. ఏం చేస్తున్నారని వెళ్లి అడగ్గా.. నెక్ట్స్ సీన్ ఏం చేయాలని రాస్తున్నానని చెప్పడంతో నాకు అర్ధమైపోయింది. నన్ను పంపించడం వాళ్లకి ఇష్టం లేదనుకుంటా. అయినా నేను రెండేళ్లు ఈ సీరియల్ కోసం వర్క్ చేశా.. నేనేంటో వాళ్లకి తెలుసు, నేనెంత కష్టపడుతానో వాళ్లకి తెలుసు. ఇంత తెలిసి కూడా ఒక ఆర్టిస్ట్‌కి ఈ మాత్రం కేర్ కూడా చేయకపోతే.. ఇలాంటి చోట, ఇలాంటి ప్లేస్‌ మనకెందుకు? వీళ్లకు నేనెందుకు? నా ప్లేస్‌లో ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అనిపించి వెంటనే ఆయనకి సారీ చెప్పి ఈ సీరియల్‌లో నేను పనిచేయలేనని దండం పెట్టేసి ఇంటికి వెళ్లిపోయానని హిమజ పేర్కొన్నారు.

నేను స్క్రీన్ టెస్ట్‌కి వెళ్లి.. నేను చేయగలనని నమ్మిన తర్వాతే రోల్ ఇచ్చారు. అందులో అవకాశం ఇచ్చినందుకు ఇప్పటికీ వాళ్లకి థ్యాంక్స్ చెబుతూనే ఉంటాను. నేను మనిషినే, కష్టపడటానికి నాకు కూడా లిమిట్ ఉంటుంది. అయితే నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి ఒక్క మాట చెప్పొచ్చు కదా అని శ్రీరామ్ గారు అన్నారు. ఆ మాట చెబితే బాగుండేదని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా. ఆరోజు పరిస్ధితులు, నా హెల్త్ అన్ని కలిపి కోపం నషాళానికి అంటేసింది.. ఏం గుర్తురాలేదు, నాకొద్దు.. నేను వెళ్లిపోవాల్సిందే అని ఫిక్స్ అయ్యానని నాటి పరిస్థితులపై హిమజ ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: bigg boss himaja reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X