నా బాడీలో అవి బాలేవన్నారు.. డైరెక్టర్లు అలా చేసేవారు: బిగ్ బాస్ హిమజ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు కూడా సందడి చేస్తోన్నారు. తద్వారా ప్రేక్షకులను అలరించడంతో పాటు వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో గుంటూరు చిన్నది హిమజ ఒకరు. ముందుగా బుల్లితెరపై సందడి చేసిన ఈ భామ.. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. ఇక, తాజాగా హిమజ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అవేంటో మీరే చూసేయండి!

స్వయంవరంతో ఫుల్ ఫేమస్

స్వయంవరంతో ఫుల్ ఫేమస్

సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో హిమజ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలో సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను సైతం దక్కించుకుంది.

వరుస చిత్రాలు.. పాపులారిటీ

వరుస చిత్రాలు.. పాపులారిటీ

సుదీర్ఘమైన కెరీర్‌లో హిమజ ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించింది. అందులో 'శివమ్', 'నేను శైలజ', 'ధృవ', 'శతమానంభవతి', 'స్పైడర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వినయ విధేయ రామ', 'చిత్రలహరి', 'వరుడు కావలెను' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పేరును తెచ్చాయి. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా భారీ స్థాయిలోనే వస్తున్నాయి.

బిగ్ బాస్ ఛాన్స్.. మరింతగా

బిగ్ బాస్ ఛాన్స్.. మరింతగా

సినిమాలు, షోలు చేస్తూ సాగిపోతోన్న సమయంలో హిమజ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులో తనదైన మార్కు చూపించి అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు నిజాయితీగా ఆడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. కానీ, మధ్యలోనే వెళ్లిపోయింది. దీని తర్వాత రేంజ్‌ను భారీగా పెంచుకుంది.

హీరోయిన్‌గా... సైకోలా రచ్చ

హీరోయిన్‌గా... సైకోలా రచ్చ

ఆ మధ్య హిమజ హీరోయిన్‌గా 'జ' అనే సినిమాను చేసింది. ప్రతాప్ రాజ్ హీరోగా నటించిన ఈ సినిమాను సైదిరెడ్డి చిట్టెపు తెరకెక్కించాడు. ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదలైంది. అలాగే, హిమజ 'కనబడుటలేదు' అనే సినిమాలోనూ నటించింది. ఇందులో ఆమె ఓ రకంగా సైకో పాత్రను పోషించింది. ఈ చిత్రం హిట్ కాకున్నా నటిగా ఈ అమ్మడికి మాత్రం మంచి పేరు దక్కింది.

చాలా సందర్భాల్లో ఏడ్చాను

చాలా సందర్భాల్లో ఏడ్చాను

గతంలో కంటే ఇప్పుడు కాస్త స్పీడు తగ్గించిన హిమజ తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడింది. ఈ సందర్బంగా తన కెరీర్‌లోని కష్టాలను వెల్లడించింది. 'సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను చాలా సందర్భాల్లో ఏడ్చాను. అందరిలాగే నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. ఒకానొక సమయంలో ఇదంతా నావల్ల కాదని బాగా ఏడ్చేశాను' అని చెప్పుకొచ్చింది.

నిజాయితీగా ఉంటే చాలు

నిజాయితీగా ఉంటే చాలు

హిమజ కంటిన్యూ చేస్తూ.. 'సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది అనేది పట్టించుకోకుండా.. మనం నిజాయితీగా ఉన్నామా లేదా అనేది మనకు తెలిస్తే చాలు. మనం చేసే పని కరెక్ట్ అయితే ఏమీ పట్టించుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగాలి. పనికి రాని మాటలను విని వెంటనే వదిలేయాలి. వాటిని పర్సనల్‌గా తీసుకోకూడదు' అని పేర్కొంది.

నా కళ్లు బాలేవని అన్నారు

నా కళ్లు బాలేవని అన్నారు

ఆ తర్వాత హిమజ 'కెరీర్ మొదలైన కొత్తలో నా బాడీపై కొన్ని కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా నా కళ్లు బాగోవని కొందరు డైరెక్టర్లు నా ముఖం మీదనే చెప్పారు. అప్పుడు చాలా బాధ పడ్డాను. కానీ, మేకప్‌ వేసుకుని రెడీ అయిన తర్వాత మాత్రం వాళ్లకు నా కళ్లే బాగా నచ్చేవి. అలాగే, నేను మగాడిలా నడుస్తానని అన్నారు. అది మాత్రం మార్చడానికి ట్రై చేస్తూనే ఉన్నాను' అని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X