బీచ్‌లో ఇనాయా హాట్ మూడ్: అచ్చం ఇలియానాలా.. ఆ డైరెక్టర్ చూడలేదా?

గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో లోకల్ బ్యూటీలకు అవకాశాలు బాగానే దక్కుతున్నాయి. అలా ప్రస్తుతం మన వెండితెరపై ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అందులో బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. ఆర్జీవీతో పార్టీ, బిగ్ బాస్ షోలో ఛాన్స్ పట్టేయడం వంటి వాటితో పాపులర్ అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేసే ఇనాయా.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

వరుస మూవీలు చేసినా:చాలా రోజుల క్రితమే ఇనాయా సుల్తానా సినిమాల్లోకి వచ్చింది. మొదట్లో చాలా చిన్న పాత్రల్లోనే కనిపించిన ఈ భామ.. 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఇనాయాకు పేరు మాత్రం దక్కలేదు.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Looking Photos Viral

వర్మతో చిందేసి ఛాన్స్:సినిమా నటిగా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేకపోయిన ఇనాయా.. రాంగోపాల్ వర్మతో మందు పార్టీతో సెన్సేషన్‌ అయింది. ఫలితంగా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. దీంతో బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇనాయాకు ఆఫర్ వచ్చింది. ఇందులో తనదైన ఆట, అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. ప్రేక్షకుల హృదయాలు గెలిచింది. ఇలా ఫినాలే ముందరే ఎలిమినేట్ అయింది.

తక్కువగానే... టూర్లతో:బిగ్ బాస్ షోలో అదిరిపోయే ఆటతీరుతో మెప్పించినా ఇనాయా సుల్తానా విజయం మాత్రం సాధించలేదు. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇలా కొద్ది రోజుల క్రితం ప్రసారం అయిన 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో డ్యాన్స్ చేసింది. కానీ ఫస్ట్ ఎలిమినేషన్‌లోనే వెళ్లిపోయింది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు టూర్లకు వెళ్తూ బిజీగా మారింది.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Looking Photos Viral

అక్కడ యమ బిజీగా:తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన రీతిలో సందడి చేస్తోన్న ఇనాయా సుల్తానా.. ఈ మధ్య కాలంలోనే కాస్త బిజీగా ఉంటోంది. అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలతో ఆకర్షిస్తూ:ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో ఆరంభం నుంచే ప్రత్యేకమైన పంథాలో వెళ్తోంది. ముఖ్యంగా తరచూ అందాలను ఆరబోస్తూ ఈ చిన్నది ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే నిత్యం ఇనాయా సుల్తానా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడి పేరు తరచూ సంచలనంగా మారిపోతోంది.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Looking Photos Viral

ఇనాయా పిక్స్ వైరల్‌:బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బికినీ ధరించి రెచ్చగొట్టేలా ఫోజులిచ్చింది. వీటిలో ఆమె అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇనాయా సుల్తానా షేర్ చేసిన ఫొటోలు అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

Bigg Boss Fame Inaya Sultana Beautiful Looking Photos Viral

ఇలియానా.. పూరీపై:తాజాగా ఇనాయా సుల్తానా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లను పెడుతున్నారు. ముఖ్యంగా ఓ నెటిజన్ 'ఇలియానాలా ఉన్నావు.. ఇంకా పూరీ జగన్నాథ్ నిన్ను చూడలేదా' అని రిప్లై ఇచ్చాడు. మరికొందరేమో 'యమ సెక్సీగా ఉన్నావు', 'వర్మ గాడి బ్రాండ్ కనిపిస్తుంది', 'బాగా పెంచేశావ్' అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X