బాత్రూంలో రెచ్చిపోయిన ఇనాయా: ఒక కాలు పైకెత్తి మరీ.. ఆమెనిలా చూశారంటే!
తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. ప్రేక్షకులు ఆదరించడంతో నెంబర్ వన్ రియాలిటీ షోగా మారిపోయింది బిగ్ బాస్. దీంతో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లను పాపులర్ చేస్తోంది. అలాంటి వారిలో ఆరో సీజన్‌లో కంటెస్టెంట్ ఇనాయా సుల్తానా ఒకరు. ఫైర్ బ్రాండ్‌గా ఈ సీజన్‌లో రచ్చ చేసిన ఈమె.. షో తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తూ.. తాజాగా ఇనాయా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూయండి!

అలా పరిచయమైన ఇనాయా
తెలంగాణకు చెందిన ఇనాయా సుల్తానా నటిగా మారడానికి ముందే మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో తన అందచందాలతో మాయ చేయడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇనాయా సుల్తానా 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించింది.

ఎన్నో చిత్రాలు.. ఆ పార్టీ వల్ల
నటిగా పరిచయమైన కొత్తలోనే ఇనాయా సుల్తానాకు పేరొచ్చింది. దీంతో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. వీటిలో 'ఇనాయా బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి సినిమాలు పేరు తెచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో మందేసి చిందేస్తూ తీసుకున్న వీడియోతో ఇనాయా ఒక్కసారిగా సంచలనంగా మారింది.

బిగ్ బాస్ ఛాన్స్.. రచ్చ చేసి
తన రేంజ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న ఇనాయా సుల్తానాకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ, డేర్ అండ్ డైనమిక్‌గా ఉంటూ ఫినాలేకు ముందు వరకూ కొనసాగింది.

వరుస ఆఫర్లు.. టూర్లు.. లవ్
బిగ్ బాస్ షోలో ఇనాయా సుల్తానా టైటిల్‌ను గెలవకపోయినప్పటికీ.. ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో షో తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా 'బీబీ జోడీ' షోలో రోల్ రైడాతో చేసింది. కానీ వెంటనే ఎలిమినేట్ అయింది. అలాగే, 'క్రాంతి' అనే చిత్రంలో నటించింది. ఇక, బిగ్ బాస్ ఫేం సోహైల్‌కు ప్రపోజ్ చేసింది. ఇప్పుడేమో టూర్లతో బిజీగా గడుపుతోంది.

అందులో మాత్రం బిజీగానే
వరుస పెట్టి సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ మజాను పంచుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతూ
హాట్ హీరోయిన్‌గా పేరొందిన ఇనాయా సుల్తానా.. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా గ్లామర్ షో చేస్తూ యమా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును మాయ చేస్తోంది. బిగ్ బాస్ తర్వాత కాస్త డోస్ పెంచేసి మరీ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఇనాయా సుల్తానా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ఇనాయా బాత్రూం ఫొటోలు
డైనమిక్ లేడీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బాత్రూంలో చిత్ర విచిత్రమైన భంగిమలతో ఫోజులిస్తూ రెచ్చిపోయింది. వీటిలో ఇనాయా సుల్తానా అందాల సంపద ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ దక్కడంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











