నన్ను అలా వాడుకోవాలని.. వారిని ఎలా దెబ్బ కొడుతానంటే? ఇనయ సుల్తానా

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇనయ సుల్తానా (Inaya Sultana).. బిగ్‌బాస్ తెలుగు 6 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నది. షోలో ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలు, గ్లామర్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా కొనసాగుతోంది. ఇటీవల ఆహా ఓటీటీలో విడుదలైన '3 రోజెస్'సిరీస్‌లో నటించిన ఇనయా, ఆ సిరీస్ నుంచి పలు వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కెరీర్ ఊహించినంత సాఫీగా సాగలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

బిగ్‌బాస్ తర్వాత అవకాశాలు వరదలా వస్తాయని చాలామంది భావిస్తారని, కానీ తన విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఇనయా వెల్లడించింది. 'బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. దాదాపు ఏడాది పాటు ఖాళీగానే ఉన్నాను. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతానేమో అని భయపడ్డా' అని ఆమె చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తానెప్పుడూ చేతులెత్తలేదని, అవకాశాల కోసం తానే ముందుకు వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టానని తెలిపింది.

Bigg Boss Fame Inaya Sultana Opens Up About Career Struggles After Show

ఆ సమయంలో తెలిసిన ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరిగానని, 'నన్ను బిగ్‌బాస్ యాక్టర్‌గా కాకుండా ఒక నటిగా చూడండి. ఏ పాత్ర ఇచ్చినా చేస్తాను'అంటూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలో ఎలా అవకాశాల కోసం తిరిగానో, బిగ్‌బాస్ తర్వాత కూడా అలాగే తిరగాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అవకాశాలు వచ్చినప్పటికీ అవి తనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదని ఇనయా చెప్పింది. 'దాదాపు 11 సినిమాల్లో నటించాను. మరో నాలుగు, ఐదు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కానీ చాలా సినిమాల్లో నేను నటించినప్పటికీ, ఎడిటింగ్‌లో నా పాత్రను పూర్తిగా తీసేస్తున్నారు. అందుకే ఇప్పటివరకు నాకు సరైన గుర్తింపు రాలేదు'అంటూ తన బాధను బయటపెట్టింది.

భవిష్యత్తుపై మాత్రం ఇనయా స్పష్టమైన ఆలోచనతో ఉంది. తాను గ్లామర్‌కే పరిమితం కాకుండా, కంటెంట్ బేస్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నానని చెప్పింది. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. 'పాత్రలో వెయిట్ ఉంటే చాలు. ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయా లేదా అన్నది కాదు, క్యారెక్టర్ ఎంత కీలకమన్నదే ముఖ్యం' అని ఆమె పేర్కొంది. ఇటీవల తాను నటించిన 'మదం' సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ఇనయా, ఆ కథలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో తన పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పింది. 'నా పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఆ పాత్ర వల్లే కథ ముందుకు సాగుతుంది. ఈ సినిమా ద్వారా అయినా నాకు నటిగా గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను' అంటూ నమ్మకం వ్యక్తం చేసింది.

తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. సన్నీ డియోల్‌తో 'చాట్', అల్లరి నరేష్‌తో 'బచ్చలమల్లి', మంచు మనోజ్‌తో 'భైరవం', అలాగే తాజాగా '3 డేస్' వంటి సినిమాల్లో నటించినట్లు తెలిపింది. ఇవన్నీ తనకు నటిగా మంచి అనుభవాన్ని ఇచ్చాయని, కానీ ఇంకా తాను ఆశించిన బ్రేక్ రావాల్సి ఉందని చెప్పింది.

అలాగే కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా ఇనయా ఓపెన్‌గా మాట్లాడింది. కొందరు అవకాశాలు ఇస్తానని చెప్పి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారని, కానీ వాటిని గట్టిగా తిరస్కరించానని తెలిపింది.'అలాంటి రోజుల్లో ప్రతి రోజు ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. కానీ ఒక రోజు నా విజయమే అందరికీ సమాధానం అవుతుందని నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని' అని చెప్పింది. ఎవరికీ హాని చేయడం తనకు ఇష్టం లేదని, మన చేతులతో కాదు, మన సక్సెస్‌తోనే మనల్ని అవమానించిన వారికి సమాధానం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఇకనైనా సరైన పాత్ర, సరైన అవకాశం దొరికితే తన సత్తా నిరూపించుకుంటానని ఇనయా గట్టి నమ్మకంతో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X