నేచర్‌నే డామినేట్ చేస్తోన్న ఇనయా సోయగాలు .. ఒంపులన్నీ చూపెడుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ ద్వారా ఫేమ్ సంపాదించిన ముద్దుగుమ్మల్లో ఇనయా సుల్తానా ఒకరు. నటి కావాలన్న లక్ష్యంతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ఆమె అనుకున్నది సాధించడంతో పాటు ఎంతో పేరు సంపాదించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు సాధిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఇనయా సుల్తానా తాజాగా పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఇనయా సుల్తానాకు నటి కావాలన్నది కల. కానీ తల్లిదండ్రులు ఆమెను ఇల్లు కదలకుండా చేశారు. తప్పించుకుంటుందేమోనన్న భయంతో ఇంట్లోనే బంధించారు. కానీ సుల్తానా మాత్రం 100 రూపాయలు తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయి నగరి నుంచి తిరుపతి బస్ ఎక్కింది. తన మిత్రుల సాయంతో కొన్నాళ్లు తిరుపతిలోనే ఉన్న ఆమె చిన్న ఉద్యోగం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కేసింది.

ఇక్కడ ఎవరూ తెలియకపోయినా భయపడి పారిపోకుండా చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ హాస్టల్‌లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఏవం జగత్, బుజ్జి ఇలారా, నటరత్నాలు, యద్భావం తద్భవతి వంటి పలు సినిమాల్లో నటించింది. ఈ దశలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ పార్టీలో మందేసి చిందేస్తూ చేసిన ఓ వీడియోతో ఆమె ఓవర్‌నైట్ పాపులర్ అయ్యింది.
అలా బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఆఫర్ కొట్టేసింది. ఫినాలే ముందు ఎలిమినేట్ అయిన ఈమె మంచి రెమ్యునరేషన్‌తో పాటు పాపులారిటీని సంపాదించింది. ఇనయా తండ్రి కూడా సినిమాల్లోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారట. కానీ అప్పటి కుటుంబ పరిస్ధితుల దృష్ట్యా అన్ని ప్రయత్నాలను విరమించుకున్నారు. అయితే ఆయన కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి కలను నెరవేర్చే బాధ్యతను ఇనయా తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న ఇనయా.. మొన్నామధ్య తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పి షాకిచ్చింది. అతడి పేరు గౌతమ్ అని .. యోగా ట్రైనర్ అని తెలిపింది. ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఇనయా.. ఏకంగా బెడ్ రూంలో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫోటోలను షేర్ చేసి షాకిచ్చింది.
తాజాగా బ్లూ కలర్ చీర కట్టుకుని నడుము మడతలు చూపెడుతూ .. పల్లెటూరి పిల్లలా ప్రకృతి అందాల నడుమ ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఇనయా సుల్తనా దీనికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. సంక్రాంతికి ఆలస్యంగా విషెస్ తెలియజేస్తున్నందుకు సారీ చెప్పిన ఇనయా.. ట్రెడిషనల్ లుక్‌లో తను ఎలా ఉన్నానో చెప్పాలని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుండగా.. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఇనయా అందాలపై ఓ లుక్కేయండి


Click it and Unblock the Notifications











