దారుణంగా బిగ్‌బాస్ ఆడపులి పరిస్ధితి ... నెల గడవటమే కష్టంగా ఉందంటూ

ఇండియాలో సూపర్ సక్సెస్ అయినా బిగ్‌బాస్ రియాలిటీ షో అదిరిపోయే టీఆర్పీలతో పాటు ఎంతో మందికి క్రేజ్ తీసుకొచ్చింది. బిగ్‌బాస్ ద్వారా జీవితంలో నిలదొక్కుకున్న వారెందరో. సినిమాలు, సీరియల్స్‌లోనూ అవకాశం దక్కించుకుని స్టార్స్‌గా వెలుగొందుతున్నారు. ఇలాంటి వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి అన్నట్లుగా ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఇనయా సుల్తానా తాజాగా పెట్టిన పోస్ట్ ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఇనయా సుల్తానాకు చిన్నప్పటి నుంచి నటి కావాలన్నది కల. కానీ తల్లిదండ్రులు ఆమెను ఇల్లు కదలకుండా చేశారు. చివరికి తప్పించుకుని పారిపోతుందన్న భయంతో కట్టడి చేశారు. కానీ ఇనయా సుల్తానా తన సంకల్పాన్ని , ఆశయాన్ని మాత్రం వదలుకోదలచుకోలేదు. ఈ నేపథ్యంలో కేవలం 100 రూపాయలు తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయి నగరి నుంచి తిరుపతి వెళ్లే బస్ ఎక్కింది. తన మిత్రులు, తెలిసిన వాళ్ల సాయంతో కొన్నాళ్లు తిరుపతిలోనే ఉన్న ఆమె చిన్న ఉద్యోగం చేసి తన కలను నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌ బస్సు ఎక్కేసింది.

bigg boss fame Inaya Sultana PhotoShoot With blue jeans Her photos here

చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ హాస్టల్‌లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నించింది. ఏవం జగత్, బుజ్జి ఇలారా, నటరత్నాలు, యద్భావం తద్భవతి వంటి పలు సినిమాల్లో నటించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఓ పార్టీలో ఆమె చేసిన హడావుడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. వర్మతో కలిసి ఆమె వేసిన స్టెప్స్ తాలుకా వీడియో వైరల్ అయ్యింది.

అలా బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఒంటరి పోరు చేసింది. అందరూ ఒకటైనా, తాను వేరు అన్నట్లే ఆడి బిగ్‌బాస్ లవర్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది. ఫినాలే ముందు ఎలిమినేట్ అయినప్పటికీ మంచి రెమ్యునరేషన్‌తో పాటు క్రేజ్‌ను సంపాదించారు ఇనయా. బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న ఇనయాఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. అతడి పేరు గౌతమ్ అని .. యోగా ట్రైనర్ అని తెలిపింది. ప్రియుడితో కలిసి విహారయాత్రలకు వెళ్తున్న ఇనయా.. ఏకంగా బెడ్ రూంలో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి షాకిచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఇనయా సుల్తానా హాట్ హాట్ ఫోటో షూట్‌లతో పాటు తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. జీన్స్ ప్యాంట్, బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించిన ఆమె కారులో డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. అలాగే ఈ పోస్ట్‌లో జీవితం బాగా కష్టంగా ఉందని.. కానీ నేను ధైర్యంగా ఉన్నానని, జనవరి నెలను విజయవంతంగా పూర్తి చేశానని, ఫిబ్రవరి కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నట్లు చెబుతూ అందరికీ మరోసారి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పింది. ప్రస్తుతం ఇనయా పెట్టి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: inaya sultana movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X