పుట్టినప్పుడే చంపేయాల్సింది.. బిగ్ బాస్ బ్యూటీ పై ఫ్యామిలీ ఆగ్రహం..

సినీ రంగంలోకి రావాలంటే కొందరికి కుటుంబ మద్దతు ఉంటుంది. మరికొందరు మాత్రం తమ కలల కోసం కుటుంబాన్నే ఎదురించి ముందుకు సాగుతుంటారు. అలాంటి కోవలోకి వచ్చే వారిలో బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా( Inaya Sultana) కూడా ఒకరు. కుటుంబానికి ఇష్టం లేకపోయినా నటనపై ఉన్న ప్యాషన్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, నేడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇనయా బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు బాగా దగ్గరైనది.ఆ షో తర్వాత పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, కొన్ని సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇనయా మాట్లాడుతూ 'సినిమాల్లోకి రావడం మొదటి నుంచే మా ఇంట్లో వారికి ఇష్టం లేదు. అయినా నా కల వదులుకోలేక కేవలం రూ.100తో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. హాస్టల్ ఫీజులు కట్టడానికి, రోజువారీ ఖర్చుల కోసం చిన్న చిన్న పాత్రలు చేశాను' అని భావోద్వేగంగా తెలిపారు. కొత్తగా వచ్చిన రోజుల్లో ఇండస్ట్రీ కమిట్‌మెంట్స్ గురించి తోటి వాళ్లు భయపెట్టినా, ఎవరి మాటలు పట్టించుకోకుండా అమీర్‌పేటలో హాస్టల్‌లో ఉంటూ తన సినీ ప్రయత్నాలు కొనసాగించానని చెప్పారు. 'స్టూడియోలు, ఆఫీసుల చుట్టూ తిరిగాను. మూడు నెలల పాటు ఒక్క అవకాశం కూడా రాలేదు. చివరకు జూనియర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేశాను. అప్పట్లో రోజుకు రూ.500 ఇచ్చేవారు... ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ కళ్లల్లో నీళ్లు వస్తాయి' అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss Fame Inaya Sultana Reveals Shocking Struggles From 100 Escape to Stardom

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటిరోజే తన స్నేహితులతో ఓ సవాల్ పెట్టుకున్నానని కూడా చెప్పారు. 'రెండు సంవత్సరాల్లో మంచి అవకాశాలు రాకపోతే కనిపించకుండా పోతాను అని చెప్పాను. నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఉంటే ఇండస్ట్రీలో ఉండాలి... లేకపోతే చచ్చిపోవాలి అన్నంత బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యాను' అని అన్నారు.

కుటుంబం నుంచి మద్దతు కాదు... గృహ నిర్బంధమే!
ఇనయా చెప్పిన మరో షాకింగ్ విషయం ఏంటంటే.. తన కుటుంబంలో అమ్మాయిల విషయంలో చాలా కఠినమైన నియమాలు ఉండేవట. సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వాతావరణంలో తాను పెరిగిందని, బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక డ్రస్ కోడ్ పాటించాలి, పెద్దలతో ఎక్కువగా మాట్లాడకూడదు, ఏ పని చేయాలో కన్నా ఏం చేయకూడదో చెప్పే నియమాలే ఎక్కువగా ఉండేవని చెప్పుకొచ్చింది. అలాంటి పరిమితుల మధ్య తన కలలను అణచుకోవాల్సి రావడం ఆమెను లోపల లోపల చంపేదట. ఆ కట్టుబాట్లలో బతకడం కంటే బయటికి వచ్చి నా జీవితాన్ని నేను నిర్మించుకోవాలనిపించింది. అందుకే ఇంట్లో నుంచి బయటకు వచ్చాను' అంటూ ఇనయా భావోద్వేగంగా చెప్పింది.

అయితే ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన కష్టాలు తీరలేదని ఆమె తెలిపింది. తన కుటుంబం తనను మాత్రమే కాదు... తనకు ఆశ్రయం ఇచ్చిన స్నేహితులను కూడా ఇబ్బంది పెట్టారని చెప్పింది. ఆ సమయంలో వాళ్లను కాపాడేందుకు తానే ముందుకు వచ్చి నిలబడ్డానని, అవసరమైతే పోలీస్ కేసు పెడతానని తల్లిదండ్రులను హెచ్చరించాల్సి వచ్చిందని చెప్పింది.

ఆ సమయంలో తల్లిదండ్రులు తనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారని ఇనయా వెల్లడించింది. 'ఇక నుంచి నువ్వు మా దృష్టిలో చనిపోయావు. నిన్ను పుట్టినప్పుడే చంపేయాల్సింది... ఆ రోజు మేం తప్పు చేశాం' అంటూ చాలా బాధాకరమైన మాటలు అన్నారని చెప్పింది. అంతటితో ఆగకుండా, 'ఇకపై మేము నీకు ఎప్పుడూ కాల్ చేయం' అంటూ పూర్తిగా సంబంధాలు తెంచుకున్నారట. ఆ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు తన తల్లిదండ్రుల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని ఇనయా తెలిపింది. ఆ నాలుగేళ్లు తన జీవితంలో ఒంటరి కాలమని, ఎవరూ లేని పరిస్థితుల్లో తానే తనకు అండగా నిలవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

ఆ రోజుల్లో ప్రతి రాత్రి హాస్టల్‌కి వెళ్లి ఏడ్చేదాన్నని, అయినా ఉదయం లేచి మళ్లీ స్టూడియోలు, ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్నని గుర్తు చేసుకుంది. 'నన్ను నమ్ముకునే వాళ్లు ఎవరూ లేరు. అయినా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అన్న ఒక్క లక్ష్యంతో ముందుకు సాగాను' అని ఆమె తెలిపింది. ఈ అనుభవాలన్నీ తనను లోపల నుంచి బలంగా మార్చాయని ఇనయా చెప్పింది. కుటుంబం దూరమైనా, అవమానాలు ఎదురైనా, ఒంటరితనం వెంటాడినా... తన కలలను వదలకుండా ముందుకు సాగడం నేర్చుకున్నానని పేర్కొంది.

ఇక బిగ్ బాస్ జర్నీ గురించి ఇనయా మాట్లాడుతూ.. బిగ్ బాస్ తన జీవితంలో ఊహించని మలుపు అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ తెలుగులో 14 వారాల పాటు షోలో ఉన్న సమయంలో ఫ్యామిలీ వీక్‌లో తల్లిదండ్రులు వస్తారని తాను కూడా ఊహించలేదని చెప్పారు. కానీ, 11వ వారం ప్రత్యేకంగా వచ్చి తనను కలిశారని తెలిపారు. 'బిగ్ బాస్ వల్లే మళ్లీ మా పేరెంట్స్‌ను కలిశాను. ఇప్పుడు మళ్లీ కలిసి ఉంటున్నాం. మా ఇంట్లో ఇప్పుడు నా మాట కూడా నడుస్తోంది'అంటూ గర్వంగా చెప్పారు.

ఇనయా జీవితంలో మరో కీలక మలుపు ఆమె బర్త్‌డే వీడియో. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో కుటుంబం పూర్తిగా దూరం పెట్టిందని ఆమె గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తర్వాత బంధువులూ మాట్లాడటం మానేశారని చెప్పుకొచ్చారు. మొత్తానికి, 'నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి, నన్ను అభిమానించే వాళ్లు ఉండాలి' అనే ఒక్క లక్ష్యంతో ముందుకు సాగిన ఇనయా సుల్తానా జర్నీ... కలల కోసం పోరాడే వారికి ఉదాహరణగా నిలుస్తోందనే చెప్పాలి.

More from Filmibeat

Read more about: inaya sultana bigg boss tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X