For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth రాకింగ్ రాకేష్ బిగ్‌బాస్ బ్యూటీ..కోడలు కాకముందే జోర్దార్‌గా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం అంటూ

  |

  బుల్లితెరపై జోడిల పేరిట నడిపించే ట్రాకులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రతీ షోలో ఇలాంటి ట్రాక్ ఒకటిని క్రియేట్ చేస్తున్నారు. ఇక ఆ జోడిలు ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మీద చేసే రొమాన్స్, కెమిస్ట్రీ చూసి జనాలు ఫిదా అవుతుంటారు. అలా జబర్దస్త్ వేదికగా మీద ఎంతో మంది ఈ ట్రాకులను వాడుకున్నారు. ఫేమస్ అయ్యారు. ఇంకా ఫేమస్ అవుతూనే ఉన్నారు. రష్మీ సుధీర్, వర్ష ఇమాన్యుయేల్ ఈ కోవకే చెందుతారు. ఇక ఇప్పుడు కొత్త కొత్త ట్రాకులు వస్తూనే ఉన్నాయి. అందులో ఆ మధ్య రాకేష్ రోహిణి ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. కొన్ని రోజులు స్కిట్లతో అదరగొట్టేశారు. అయితే ఆ తరువాత బిగ్‌బాస్ ఫేమ్ జోర్దార్ సుజాత మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది. సుజాత రాకతో రోహిణి సైడ్ అయిపోయింది. అలా ఈ ఇద్దరి ట్రాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

  రాకింగ్ రాకేష్ టీం..

  రాకింగ్ రాకేష్ టీం..


  రాకింగ్ రాకేష్ తన టీంను ఎలా వాడుకుంటాడో అందరికీ తెలిసిందే. మొదట్లో చిన్న పిల్లలతో స్కిట్లు వేసేవాడు. తాను టీంలో ప్రధాన పాత్రను పోషించడు. అందరికీ సమాన పాత్రలు ఇస్తాడు. కావాలంటే తనని తాను తగ్గించుకుంటాడు. మిగతా వాళ్లకి మంచి పాత్రలు ఇస్తుంటాడు. అలా చిన్న పిల్లలతో బాగానే స్కిట్లు కొట్టేశాడు. వాళ్ల చుట్టే స్కిట్ తిప్పేవాడు. అలా బాగానే ఫేమస్ అయ్యాడు.

  రోహిణి ఎంట్రీ..

  రోహిణి ఎంట్రీ..


  జబర్దస్త్ షోలోకి రోహిణి ఎంట్రీ ఇవ్వడం, అది కూడా రాకేష్ టీంలోకి రావడంతో కథ మారింది. మధ్యలో కొన్ని స్కిట్లు చేస్తుండటం, వారి మధ్య ట్రాక్ ఉందన్నట్టుగా బీజీఎంలు ప్లే చేయడం, లవ్ సింబల్స్ వేయడం, వాటికి తగ్గట్టుగా రాకేష్ స్కిట్లో డైలాగ్స్ ఇవ్వడం అంతా బాగానే నడిచింది. రాకేష్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కష్టాల్లో తోడున్నాడంటూ రాకేష్ గురించి రోహిణి ఎంతో గొప్పగా చెప్పింది.

  సుజాతతో ట్రాక్..

  సుజాతతో ట్రాక్..

  రోహిణితో కొన్ని రోజులు స్క్రీన్ మీద ట్రాక్ వర్కవుట్ చేయించింది జబర్దస్త్ టీం. ఆ తరువాత సుజాత ఎంట్రీతో కథ మారిపోయింది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, పెళ్లి చేసుకోబోతోన్నారనే వరకు ఈ ట్రాక్ చేరింది. ఇప్పుడు ఈ జోడి పెళ్లి మీద వచ్చే రూమర్లే ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి. సుజాత రాకేష్ ప్రేమ, పెళ్లిళ్ల మీద ఇప్పటికే కోకోల్లలుగా కథనాలు వచ్చి పడ్డాయి.

  Recommended Video

  Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
  గోవాలో సందడి..

  గోవాలో సందడి..

  ఆ మధ్య సుజాత, రాకేష్ ఇంకా జబర్దస్త్ టీం మేట్స్ అంతా కలిసి గోవాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక సుజాత, రాకేష్ అయితే ఫోటోలకు వింత పోజులు ఇచ్చారు. గోవా బీచుల్లో హంగామా చేశారు. అప్పుడే వీరిద్దరి ప్రేమ వ్వవహారం మీద మరింత ఎక్కువగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా మరోసారి వాటికి బలాన్ని చేకూర్చేలా సుజాత ఓ వీడియోను వదిలింది.

  రాకేష్ ఇంట్లో పూజలు..


  రాకేష్ సర్ ఇంట్లో వరలక్ష్మీ పూజకు వచ్చాను.. వాళ్లు బ్రాహ్మిణ్స్ కాబట్టి.. వాళ్లింట్లో పూజలు బాగా చేస్తారు.. అందుకే నేను చూసేందుకు వచ్చాను. మా ఇంట్లో ఇంత బాగా పూజలు చేయరు.. రాకేష్ సర్ వాళ్ల అమ్మ అన్నీ దగ్గరుండి బాగా చేసింది.. నెక్ట్స్ ఇయర్ ఎక్కడ ఉంటానో.. ఎలా జరుగుతుందో తెలియదు.. నాకు పూజలు అంత బాగా రాదు కాబట్టి. ఇక్కడ చూసేందుకు వచ్చాను.. అంటూ సుజాత క్లారిటీ ఇచ్చింది. అందుకోసమే రాకేష్ సర్ ఇంట్లో వరలక్ష్మీ పూజకు వచ్చాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే కోడలు కాక ముందే ఆ ఇంట్లో సందడి చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి.

  English summary
  Bigg Boss fame Jordar Sujatha attended Varalakshmi Vratham Pooja At Jabardasth fame Rocking Rakesh Home. Amid dating rumours, This pooja event attarcts netizen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X