5 ఏళ్ల గాఢంగా ప్రేమించా.. ఒక్క చిన్న తప్పుతో.. బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్ సోర్టీ

తెలుగు బుల్లితెర, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత అలియాస్ సుప్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుని నటి, బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. సినిమాల్లోకి రాకముందు యూట్యూబర్ గా బాగా ఫేమస్ అయ్యింది సీత. ముఖ్యంగా 7 ఆర్ట్స్ సరయూతో కలిసి చాలా వీడియోలు చేసింది. 7 ఆర్ట్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో ఛాన్స్ కొట్టేసింది.

బిగ్‌బాస్‌ హౌస్ లో సుమారు 40 రోజుల పాటు ఉన్న సీత తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానులకు బాగానే నచ్చేసింది. ప్రస్తుతం టీవీ షోస్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తోన్న సీత రీసెంట్ గా ఒక టాక్ షోకు హాజరైంది. తాజాగా తన వ్యక్తిగత జీవితంతో పాటు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఒక టాక్ షోలో పాల్గొన్న ఆమె, తన ప్రేమ, బ్రేకప్, అలాగే క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

Bigg Boss Fame Kirrack Seetha Opens Up on Breakup Casting Couch amp amp Struggles throwback

మొదటగా తన లవ్ స్టోరీ గురించి చెబుతూ.. ఐదేళ్ల పాటు ఒక అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నానని, తనని గాఢంగా ప్రేమించనని వెల్లడించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నప్పటికీ, ఆ అబ్బాయి కుటుంబం కొన్ని షరతులు పెట్టిందని తెలిపింది. ముఖ్యంగా తాను నటనను కొనసాగించకూడదని వారు కోరడం వల్ల సమస్యలు మొదలయ్యాయని చెప్పింది. 'ప్రేమ కంటే తల్లిదండ్రులే ముఖ్యమని అతను నిర్ణయించుకోవడంతో మా రిలేషన్ అక్కడితో ముగిసింది' అని భావోద్వేగంగా చెప్పింది.

అయితే మరో కోణంలో మాట్లాడుతూ ఈ బ్రేకప్ తన జీవితంలో చాలా కఠిన దశగా మారిందని వివరించింది. విడిపోవడం తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని, దాదాపు 14 కిలోల బరువు తగ్గానని తెలిపింది. 'ఆ సమయంలో నేను పూర్తిగా కుంగిపోయాను. బయటపడటానికి సైకియాట్రిస్ట్‌ను కూడా కలవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఆ బ్రేకప్ జరగడం మంచిదే అనిపిస్తోంది' అని చెప్పింది. ఇక తిరిగి ఆ వ్యక్తి వస్తే ఒప్పుకుంటావా? అన్న ప్రశ్నకు, "ఎప్పటికీ కాదు" అని కట్‌గా సమాధానం ఇచ్చింది.

ఇదిలా ఉంటే, తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని కూడా సీత వెల్లడించింది. ఒకసారి సినిమా అవకాశం ఉందని చెప్పి ఫోన్ చేసిన వ్యక్తులు, ఫామ్‌హౌస్‌కి రావాలని చెప్పారని తెలిపింది. మొదట అది సాధారణ ఆడిషన్ అనుకుని ఓకే చెప్పినా, తర్వాత విషయం అర్థమై వెళ్లలేదని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కాల్ చేసి, రూ.25 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టారని, కానీ అది సరైన దారి కాదని తెలుసుకుని వెంటనే నిరాకరించానని స్పష్టం చేసింది.

'ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటి కాల్స్ చాలా వస్తాయి. కొందరు నిజంగా అవకాశాలు ఇస్తామని చెప్పినా, మరికొందరు మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనమే జాగ్రత్తగా ఉండాలి' అని ఆమె సూచించింది. తనకు వచ్చిన అనుభవాలు ఇతరులకు హెచ్చరికగా ఉండాలని కూడా పేర్కొంది. 'బేబీ' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన తర్వాత కూడా ఆమెకు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదురైంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లలో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X