అది లేనిదే ఉండలేదట .. వీక్‌నెస్ బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కు ప్రజల్లో మంచి క్రేజ్ లభిస్తున్న సంగతి తెలిసిందే. సాదాసీదా వ్యక్తులు, ముక్కు మొహం తెలియని వారు కూడా ఈ మెగా రియాలిటీ షోతో సెలబ్రెటీలుగా మారిపోతుతున్నారు. హిందీ సహా ప్రాంతీయ భాషల్లో ప్రసారమైన బిగ్‌బాస్‌లో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సామాన్యులు కంటెస్టెంట్‌లుగా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విజేతలుగానూ నిలిచారు.

దాదాపు 105 రోజుల పాటు జరిగిన బిగ్‌బాస్ తెలుగు 8కు ఇటీవల ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సినీ, బుల్లితెర నటులతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యారు. వీరిలో ఒకరు కిర్రాక్ సీత. రాయలసీమలోని కర్నూలు జిల్లా నంద్యాలలో పుట్టారు కిర్రాక్ సీత. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగ రీత్య వీరి కుటుంబం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో స్థిరపడింది.

bigg boss fame kirrak seetha latest video goes viral in social media

చదువులో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సీతకి కూచిపూడి, భరతనాట్యంలోనూ ప్రావీణ్యం ఉంది. తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో సీత చిన్నప్పటి నుంచి తన పాకెట్ మనీని తనే సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబర్‌గా మారి బోల్డ్ కంటెంట్‌తో దుమ్ము రేపారు సీత. ఆమె సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ వీడియోల మహత్యమో ఏమో కానీ సీత ఏం మాట్లాడినా బోల్డ్‌గా ఉంటుంది. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆమె స్టైల్.

ఈ క్రమంలోనే సీతకు సినిమాల్లోనూ అవకాశాలు దక్కాయి. ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టి ఆమెను చెడు వ్యసనాలకు బానిసను చేసే అమ్మాయిగా అద్భుతంగా నటించింది కిర్రాక్ సీత. ఈ పాత్ర చేసిన తర్వాత తనను ఎంతో మంది తిట్టుకున్నారని , ఏకంగా రేప్ చేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె ఓ వీడియోలో వెల్లడించారు. తన పాత్ర జనంలోకి బాగా వెళ్లిందనే అనుకున్నాను తప్పించి .. వారి గురించి తప్పుగా అనుకోలేదని నా ఫ్రెండ్స్ పోలీసులకు కంప్లయంట్ చేయమన్నా చేయలేదని కిర్రాక్ సీత చెప్పారు.

ఇక మరో ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు మనుషులు వచ్చి ప్రొడ్యూసర్, దర్శకుడు మిమ్మల్ని ఫాంహౌస్‌లో కలవాలని చెప్పేవారని సీత బాంబు పేల్చారు. తాను ఎక్కడికీ రాలేనని , ఏదైనా ఆఫీస్‌లోనే మాట్లాడతానని చెప్పడంతో అలాంటి వారు మళ్లీ కాల్ చేయలేదని సీత పేర్కొంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే కిర్రాక్ సీత ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, షోల గురించి పంచుకుంటూ ఉంటుంది. తాజాగా చీరకట్టి తన ఇంటి కిచెన్‌లో టీ పెట్టుకునే వీడియోను ఆమె షేర్ చేశారు. టీ లేకుండా తాను ఉండలేనంటూ స్వాతిముత్యం మూవీలోని సువ్వి సువ్వి సీతాలమ్మ సాంగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో హోయల్ పోయారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోనూ మీరూ చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X